Hyderabad: శంషాబాద్ నుంచి తుక్కుగూడకు ఏరో రైడర్ సిటీ బస్సులు
ABN , Publish Date - Dec 31 , 2024 | 09:01 AM
శంషాబాద్(Shamshabad) నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం(Rajiv Gandhi International Airport) మీదుగా తుక్కుగూడకు 2 ఏరో రైడర్ సిటీ ఆర్డినరీ బస్సులను జనవరి 1 నుంచి ప్రారంభి స్తున్నామని గ్రేటర్‌ఆర్టీసీ ఈడీ సి.వినోద్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

- రేపటి నుంచి ప్రారంభం
హైదరాబాద్ సిటీ: శంషాబాద్(Shamshabad) నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం(Rajiv Gandhi International Airport) మీదుగా తుక్కుగూడకు 2 ఏరో రైడర్ సిటీ ఆర్డినరీ బస్సులను జనవరి 1 నుంచి ప్రారంభి స్తున్నామని గ్రేటర్‌ఆర్టీసీ ఈడీ సి.వినోద్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. శంషాబాద్ నుంచి తుక్కుగూడకు, తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6.15 వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బుల్లితెర నటికి వేధింపులు.. వ్యక్తిపై కేసు
ఈ బస్సులను రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, కార్గో సంస్థలోని ఉద్యోగస్తులు, ఫార్మా కంపెనీలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఈ సేవలు వినియోగించుకోవాలన్నారు. ఈ బస్సుల్లో రూ.1150తో నెలవారీ బస్‌పాస్‌ను ఎయిర్ పోర్ట్(Airport)లోని బస్‌పాస్ సెంటర్ వద్ద పొందవచ్చన్నారు. ఈ బస్‌పాస్ ఏరో రైడర్ బస్సులతోపాటు సిటీ ఆర్డినరీ, సబర్బన్ సర్వీ్‌సలో కూడా చెల్లుబాటు అవుతుందన్నారు.
బస్సుల సమయపాలన వివరాలు...
- శంషాబాద్ బస్‌స్టేషన్ నుంచి తుక్కుగూడకు: ఉ. 6:00, 7:05, 8:15, 9:20, 10:25, 11:30, 12:50, 13:55, 15:00, 16:05, 17:10, 18:15
- తుక్కుగూడ నుంచి శంషాబాద్ బస్‌స్టేషన్‌కు : ఉ.6:00, 7:05, 8:15, 9:20, 10:25, 11:30, 12:50, 13:55, 15:00, 16:05, 17:10, 18:15
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్ కదలికలు?
Read Latest Telangana News and National News