Share News

Lok Sabha Elections 2024: నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల స్వీకరణ

ABN , Publish Date - Apr 16 , 2024 | 06:30 PM

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం అంటే ఏప్రిల్ 18వ తేదీన విడులకానుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ వెల్లడించారు. ఆ రోజే నుంచే ఎంపీ అభ్యర్థల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.

Lok Sabha Elections 2024: నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల స్వీకరణ
GHMC Commissioner Ronald Rose

హైదరాబాద్, ఏప్రిల్ 16: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం అంటే ఏప్రిల్ 18వ తేదీన విడులకానుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ వెల్లడించారు. ఆ రోజే నుంచే ఎంపీ అభ్యర్థల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.

LokSabha Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు వేళాయే..

మంగళవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 45లక్షల 70 వేల ఓట్లు ఉన్నాయన్నారు. అలాగే జిల్లా పరిథిలో 1,675 ప్రాంతాల్లో 3,986 పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని లిక్కర్ ఔట్ లెట్స్‌లో సీసీ టీవీ కెమెరాలున్నట్లు వివరించారు.


ఎన్నికల వేళ ఏమైనా ఫిర్యాదులు చేయాలంటే.. 1950 నెంబరికి కానీ లేకుంటే 1800 599 2999 నంబర్లకు కాల్ చేయవచ్చునని జిల్లా ప్రజలకు ఆయన సూచించారు. అలా కాకుంటే సి విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాధు చేయవచ్చునన్నారు.

KTR: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్... కేటీఆర్ విసుర్లు

అయితే ఎన్నికల నగరా మోగిన నాటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో రూ. 16 కోట్లు సీజ్ చేయగా.. అందులో రూ.14 కోట్లు నగదు ఉందని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు ఎంసీసీ కేసులు 3 నమోదు కాగా... 265 మందిని కోడ్ ఉల్లంఘన కింద అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు.


నామినేషన్ వేసే అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులు బహిరంగంగానే ప్రకటన చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. పోటీ చేసే అభ్యర్థి ఖచ్చితంగా 25 ఏళ్లు నిండిన వారై ఉండాలన్నారు. అయితే నామినేషన్లు దాఖలుకు సమయం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Lok Sabha Polls 2024: తొలి దశ పోలింగ్‌కు ఈసీ సన్నాహాలు

ఇక రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితోపాటు అయిదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. వంద మీటర్ల దూరంలోనే వాహనాలు నిలపాలన్నారు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గ పరిథిలో కేవలం 45 శాతం మేరే ఓటింగ్ జరిగిందని గుర్తు చేశారు.


ఈ సారి ఆ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు హాజరుకాకుంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను ఆయన హెచ్చరించారు. ఎన్నికల శిక్షణ కోసం 23 వేల మందిని పిలిస్తే. వారిలో 3, 700 మంది శిక్షణకు హాజరుకాలేదన్నారు.

UPSC Results: సివిల్స్-2024 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు వీళ్లే

మరోవైపు బోగస్ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఆ క్రమంలో భారత ఎన్నికల సంఘానికి నివేదిక సైతం ఇప్పటికే పంపామన్నారు. మరణించిన వారి పేర ఉన్న 30 వేల ఓట్లు, లక్ష షిప్టెడ్ ఓట్లతోపాటు 2 లక్షలకు పైగా ఉన్న నకిలీ ఓట్లను తొలగించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ వివరించారు.

తెలంగాణ వార్తలు కోసం..

Updated Date - Apr 16 , 2024 | 06:30 PM