Share News

UPSC Results: సివిల్స్-2024 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు వీళ్లే

ABN , Publish Date - Apr 16 , 2024 | 05:58 PM

యూపీఎస్సీ మంగళవారం ప్రకటించిన సివిల్స్-2024 ఫలితాల్లో పలువురు తెలుగు తేజాలు సత్తా చాటారు. యుపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు తేజాలు సత్తా చాటారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్య రెడ్డి సివిల్ సర్వీసెస్‌లో దేశంలో మూడవ ర్యాంక్ సాధించారు. ఇక ఆదిలాబాద్‌కు చెందిన రాజ్ కుమార్ చౌహాన్‌కు 703వ ర్యాంక్ దక్కింది. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన సాయి అలేఖ్యకు 938 ర్యాంక్ వచ్చింది.

UPSC Results: సివిల్స్-2024 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు వీళ్లే

హైదరాబాద్: యూపీఎస్సీ మంగళవారం ప్రకటించిన సివిల్స్-2024 ఫలితాల్లో పలువురు తెలుగు తేజాలు సత్తా చాటారు. యుపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు తేజాలు సత్తా చాటారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్య రెడ్డి సివిల్ సర్వీసెస్‌లో దేశంలో మూడవ ర్యాంక్ సాధించారు. ఇక ఆదిలాబాద్‌కు చెందిన రాజ్ కుమార్ చౌహాన్‌కు 703వ ర్యాంక్ దక్కింది. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన సాయి అలేఖ్యకు 938 ర్యాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హనిత వేములపాటికి 887 ర్యాంక్ వచ్చింది. సివిల్స్‌కు అంగవైకల్యం అడ్డుకాదని ఆమె నిరూపించారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.


రాజ్ కుమార్ చౌహాన్ స్పందిస్తూ.. అదిలాబాద్ ట్రైబల్ ఏరియాకు చెందిన కుటుంబాల్లో తాను జన్మించానని చెప్పారు. ‘‘ మా నాన్న ఒక టీచర్. నవోదయ స్కూల్లో చదువుకొని సివిల్స్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఇక సాయి అలేఖ్య మాట్లాడుతూ.. ‘‘ మా నాన్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. మా తల్లిదండ్రుల ప్రోత్సహంతో ఈ రోజు ర్యాంక్ సాధించాను’’ అని అన్నారు. తన తండ్రి రావూరి ప్రకాష్ రావ మధిరలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని చెప్పారు.


సివిల్స్‌లో మా అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు: బాలలత

సివిల్స్‌ ఫలితాల్లో సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారని సివిల్స్ ర్యాంకర్, ప్రముఖ మెంటర్ బాలలత వెల్లడించారు. మొత్తం 16 మంది విద్యార్థులు సత్తా చాటారని, ఎన్నో కష్టనష్టాలు ఎదురుకొని విజయాలు సాధించారని ఆమె చెప్పారు. పట్టు వదలకుండా మూడు నాలుగు ప్రయత్నాలు చేసి విజయం సాధించారని పేర్కొన్నారు. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి విజయాలు సాధించారని, తెలుగు యువత కోసం, విద్యార్థులు ఐఏఎస్ సాధించేవరకు తన పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. టాప్ ర్యాంక్స్ సాధించిన వారందరికీ ఆమె అభినందనలు తెలిపారు.


1. మెరుగు కౌశిక్ - 82

2. పెంకేష్ ధీరజ్ రెడ్డి - 173

3. బాను శ్రీ - 198

4. హరి ప్రసాద్ రాజు - 475

5. శ్రీనివాసులు - 526

6. కిరణ్ సాయింపు - 568

7. మర్రిపాటి నగదత్ - 580

8. ఐశ్వర్య నీలి శ్యామల - 649

9. రాజ్ కుమార్ చౌహన్ - 703

10. సందీప్ కుమార్ - 830

11. రాహుల్ - 873

12. హరిత వేములపాటి - 887

13. శశి కాంత్ - 891

14. కేశవ రావు మీనా - 899

15. సాయి అలేఖ్య - 938

16. నవ్యశ్రీ - 995.

మొత్తం 16 మంది ర్యాంకులు సాధించినట్టు బాలలత వెల్లడించారు.

Updated Date - Apr 16 , 2024 | 06:00 PM