Share News

Lok Sabha Polls 2024: తొలి దశ పోలింగ్‌కు ఈసీ సన్నాహాలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 04:41 PM

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19వ తేదీ తొలి దశ పోలింగ్ జరగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సర్వం సిద్దం చేస్తుంది.

Lok Sabha Polls 2024: తొలి దశ పోలింగ్‌కు ఈసీ సన్నాహాలు
Chief Election Commissioner

న్యూఢిల్లీ, ఏప్రిల 16: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19వ తేదీ తొలి దశ పోలింగ్ ( First Phase polling) జరగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) (Chief Election Commission)సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు సీఈసీ సర్వం సిద్దం చేస్తుంది.

తొలిదశలో ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు...ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌, అసోంల్లో పోలింగ్ జరగనుంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌ల్లో సైతం ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.

Lok Sabha Elections: భయపడను, మడం తిప్పేది లేదు: మోదీ


ఇక తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉంటే.. వాటిలో 8 స్థానాలు.. షహరాన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజనూర్, నగినా, మొరాదాబాద్, రామ్‌పూర్, పిల్‌బిత్‌ స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.

Amir Khan: అది నకిలీ వీడియో, ఏ పార్టీని ప్రమోట్ చేయడం లేదు..

అలాగే పశ్చిమబెంగాల్‌లో మొత్తం 42 స్థానాలు ఉన్నాయి. వాటిలో ఈ దశలో 3.. కుచ్ బిహార్, జల్పాయిగురి, అలీపుర్‌దౌర్స్‌‌ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాల్లోని 5 స్థానాలు.. రామ్‌టెక్, నాగ్‌పూర్, బందారా గోండియా, గడ్చిరౌలి, చిముర్, చంద్రాపూర్‌ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.


ఇక ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్‌లో 2, మణిపూర్‌లో 2, మేఘాలయాలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్‌లో 1, సిక్కిం, త్రిపురలలో ఒక్కో లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది. ఉత్తరాఖండ్‌లో 5 లోక్‌సభ స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్, జమ్ము, కశ్మీర్‌లో ఒక్కో లోక్‌సభ స్థానానికి ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

దేశంలో మొత్తం 534 లోక్‌సభ స్థానాలు ఉంటే.. వాటికి ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19 తేదీతో మొదలై.. ఏడో దశ లేదా చివరి దశ పోలింగ్ జూన్ 1వ తేదీతో ముగియనుంది.

Lok Sabha Elections: పంజాబ్‌లో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

దీంతో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవుతోంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో కేంద్రంలో ఏ పార్టీకి ఓటరు పట్టం కడతాడనేది ఆ రోజు సుస్పష్టం కానుంది.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 16 , 2024 | 04:43 PM