Share News

TG Politics: సోషల్ మీడియాలో ఆయన బాగోతం అందరికీ తెలుసు: ఈటల రాజేందర్

ABN , Publish Date - May 23 , 2024 | 10:00 PM

నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendar) ఆరోపించారు. నిరుద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఆయన బాగోతం అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు.

TG Politics: సోషల్ మీడియాలో ఆయన బాగోతం అందరికీ తెలుసు: ఈటల రాజేందర్
Eatala Rajendar

సూర్యాపేట: నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendar) ఆరోపించారు. నిరుద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఆయన బాగోతం అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు.

పట్టభద్రులకు కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పిన తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని చెప్పారు. తీన్మార్ మల్లన్న పార్టీలు మారడం తప్పితే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై తీన్మార్ మల్లన్న ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు.


ఉద్యోగ క్యాలెండర్ ఏది..?

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఈటల రాజేందర్ సూర్యాపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... రేపటి తెలంగాణ అవిష్కరించేది గ్యాడ్యుయేట్‌లు అని తెలిపారు. వెళ్లిన ప్రతీ చోట సమస్యలే తప్పా ఏ వర్గం సంతోషంగా లేరని చెప్పారు. పోరాటాలు చేసి తెలంగాణ సాధిస్తే ఉద్యోగ నోటిఫికేషన్ కరువైందని చెప్పారు. ఉద్యోగ క్యాలెండర్ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలలు కావస్తున్నా నోటిఫికేషన్ ఊసే లేదని చెప్పారు. 12 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.


ఆయన పట్టభద్రులను మధ్యలో వదిలేశారు..: పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఖమ్మం జిల్లా: పట్టభద్రుల సభ మండలికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఆశీర్వదించి పంపించాలని బీజేపీ తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి (Ponguleti Sudhakar Reddy) కోరారు. పట్టభద్రులను మధ్యలో వదిలేసి, వారి ఆశలను అడియాశలు చేసి మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేశారని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయని చెప్పారు. బీజేపీ అభ్యర్థిగా చాలా సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా పని చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారని తెలిపారు.


కమలం గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు, పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, టీడీపీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాధం పాల్గొన్నారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతకు హామీలు ఇచ్చి మరిచారని ఫైర్ అయ్యారు. పెద్దల సభలో తన గొంతును వినిపించే ఓకే ఒక వ్యక్తి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అని చెప్పారు. మూడోసారి నరేంద్ర మోదీ 400 సీట్లతో ప్రధాని అవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మోదీ గ్యారెంటీ అంటే కోహినూర్ వజ్రం వంటి గ్యారెంటీ అని పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.

Updated Date - May 23 , 2024 | 10:05 PM