Share News

TG Politics: నమో అంటే కొత్త అర్థం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Apr 06 , 2024 | 08:58 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. కార్యకర్తల చెమటతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని గుర్తుచేశారు. తుక్కుగూడలో జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

TG Politics: నమో అంటే కొత్త అర్థం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Revealed Meaning Of NAMO

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి (BRS) పట్టిన గతే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి (BJP) పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తేల్చి చెప్పారు. కార్యకర్తల చెమట చిందించడం వల్ల తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని గుర్తుచేశారు. తుక్కుగూడలో జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గోదావరి, కృష్ణా నది పోటెత్తి సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో తుక్కుగుడ అలా కనిపిస్తోందని కార్యకర్తలను రేవంత్ రెడ్డి ఉత్తేజ పరిచారు. తమపై గుజరాత్ ఆధిపత్యం నడవదని తేల్చిచెప్పారు.


బీజేపీ మోసం చేసింది

ఉద్యోగాల పేరుతో బీజేపీ మోసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులను చంపినందుకు బీజేపీకి ఓటేయాలా? మతాల మధ్య చిచ్చు పెట్టినందుకు వేయాలా..? అని రేవంత్ అడిగారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య చిచ్చు పెట్టి మరోసారి అధికారంలోకి వద్దామని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. హైదారాబాద్‌లో వరదలు వస్తే ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మోదీకి తెలంగాణ అంటే చిన్న చూపు అని వివరించారు. నమో అంటే కొత్త అర్థం చెప్పారు. నమ్మితే మోసం పోవడం ఖాయం అన్నారు. బీజేపీని బొంద పెట్టే వరకు నిద్రపోవద్దని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి:

TG Politics: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసొచ్చేనా..?

TG Politics: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 08:58 PM