Share News

Amit Shah: తెలంగాణలో అమిత్ షాపై కేసు నమోదు.. ఎందుకంటే..

ABN , Publish Date - May 03 , 2024 | 09:29 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పై తెలంగాణలోని(Telangana) మొఘల్ పురా పోలీస్ స్టేషన్‌లో(Moghalpura Police Station) కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అసలు అమిత్ షా పై ఎందుకు కేసు నమోదు చేశారో చూద్దాం..

Amit Shah: తెలంగాణలో అమిత్ షాపై కేసు నమోదు.. ఎందుకంటే..
Amit Shah

హైదరాబాద్, మే 03: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పై తెలంగాణలోని(Telangana) మొఘల్ పురా పోలీస్ స్టేషన్‌లో(Moghalpura Police Station) కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అసలు అమిత్ షా పై ఎందుకు కేసు నమోదు చేశారో చూద్దాం..


మే 1వ తేదీన పాతబస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు మద్ధతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో మాధవి లత మాట్లాడుతుండగా.. వేదికపైకి ఇద్దరు మైనర్ బాలికలు వచ్చారు. అమిత్ షా ఆ చిన్నారులను తన వద్దకు రమ్మంటూ సైగ చేయడంతో.. ఆ చిన్నారులు షా వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తు.. మరో ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బార్ 400 సీట్లు అనే ప్లకార్డ్స్ ఉన్నాయి.


ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవగా.. కాంగ్రెస్ దీనిపై కంప్లైంట్ చేసింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘించారంటూ బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఈసీ.. విచారణ జరపాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొఘల్ పుర పీఎస్‌లో సెక్షన్ 188 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు. A1 - యమాన్ సింగ్, A2 - హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, A3 - కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, A4 - రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, A5 -MLA రాజసింగ్ తో పాటు పలువురి పై కేసు నమోదు చేశారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 03 , 2024 | 09:29 PM