Share News

BRS: బీఆర్‌ఎస్‌ ఎన్నికల సమన్వయకర్తలు వీరే..

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:16 PM

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సమన్వయంపై బీఆర్‌ఎస్‌(BRS) ప్రత్యేక దృష్టి సారించింది. నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో ప్రచారపర్వాన్ని పరుగెత్తించేలా.. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం సీనియర్‌ నేతలకు బాధ్యతలను అప్పగించారు.

BRS: బీఆర్‌ఎస్‌ ఎన్నికల సమన్వయకర్తలు వీరే..

హైదరాబాద్‌ సిటీ: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సమన్వయంపై బీఆర్‌ఎస్‌(BRS) ప్రత్యేక దృష్టి సారించింది. నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో ప్రచారపర్వాన్ని పరుగెత్తించేలా.. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం సీనియర్‌ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శనివారం నియోజకవర్గాల వారీగా, పలు డివిజన్లకు సమన్వయకర్తలను నియమించారు. జూబ్లీహిల్స్‌(Jubilee Hills)కు షేక్‌అబ్దుల్లాసోహైల్‌ను, సికింద్రాబాద్‌కు రాజీవ్‌సాగర్‌ను, అంబర్‌పేటకు దాసోజు శ్రవణ్‌ను, సనత్‌నగర్‌కు వెంకట్‌రెడ్డిని, ముషీరాబద్‌కు పీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎండీ సలీమ్‌లను, నాంపల్లికి మహమూద్‌అలీ, ప్రభాకర్‌రావులను, ఖైరతాబాద్‌కు ఎంఎన్‌ శ్రీనివాస్‏ను నియమించారు.

ఇదికూడా చదవండి: TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

డివిజన్లకు: వెంకటేశ్వరకాలనీ- మన్నె కవితారెడ్డి, ఖైరతాబాద్‌-మన్నె గోవర్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ - వెంకటేష్‌, బంజారాహిల్స్‌ - విప్లవ్‌కుమార్‌, హిమాయత్‌నగర్‌-హేమలత, బాబుయాదవ్‌, సోమాజిగూడ - ఆశిష్ యాదవ్‌.

ఇదికూడా చదవండి: Madhavilatha: మాధవీలత స్ట్రాంగ్‌ ఉమెన్‌.. ఇన్‌స్టాలో పోస్టు చేసిన రేణుదేశాయ్‌

Read More Telangana and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 01:16 PM