Share News

KTR: ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయం... మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:06 AM

కృష్టా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించబోమంటూ నేడు (సోమవారం) తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్ఎస్ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్!’ కారణంగా అధికార పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందని వ్యాఖ్యానించారు.

KTR: ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయం... మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

కృష్టా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించబోమంటూ నేడు (సోమవారం) తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్ఎస్ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్!’ కారణంగా అధికార పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం ఇదని ఆయన అభివర్ణించారు. కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా రేపు (మంగళవారం) నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తీర్మానాన్ని ప్రవేశపెట్టనుందని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ట్వీట్‌కు మాజీ సీఎం కేసీఆర్ ఫొటోని కేటీఆర్ జోడించారు.

Updated Date - Feb 12 , 2024 | 11:06 AM