Babu Mohan: కేసీఆర్‌లా కేఏ పాల్ అబద్దాలు చెప్పడు
ABN , Publish Date - Apr 01 , 2024 | 04:29 PM
1: తాను పుట్టింది వరంగల్‌లోనేనని ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బాబు మోహన్ వెల్లడించారు. ఆ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు.
వరంగల్, ఏప్రిల్ 1: తాను పుట్టింది వరంగల్‌లోనేనని ప్రజాశాంతి పార్టీ (praja shanthi party) తెలంగాణ అధ్యక్షుడు బాబు మోహన్ (Babu Moha) వెల్లడించారు. ఆ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ నగరానికి ఎప్పుడు వచ్చినా తన అడ్డా మాత్రం కరుణపురంలోనే అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రజాశాంతి పార్టీ నుంచే తాను ఎంపీగా పోటీ చేస్తానని బాబూ మోహన్ స్పష్టం చేశారు. తాను వేరే పార్టీ నుంచి పోటీ చేస్తానని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. చీప్ రాజకీయాలు చేయవద్దంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ప్రజలు తనను గెలిపించాలని... అందరూ శెభాష్ అనేలా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.
సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌లాగా తమ పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) అబద్ధాలు చెప్పరనన్నారు. టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ నేతలు మోసం చేశారని.. ఆ పార్టీ నేతల వ్యవహారశైలిపై మండిపడ్డారు. తాను గెలిచిన తర్వాత పేదలందరికీ పింఛన్లు ఇప్పిస్తానని.. అలాగే ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తానని బాబూ మోహన్ ప్రకటించారు.
మరిన్నీ తెలంగాణ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్డేట్