Share News

Delhi liquor Scam: కవిత చిన్న కొడుకు ఒంటిరిగా ఏం లేడు: ఈడీ తరపున న్యాయవాది

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:29 PM

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై గురువాం ఢిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా... ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు.

Delhi liquor Scam: కవిత చిన్న కొడుకు ఒంటిరిగా ఏం లేడు: ఈడీ తరపున న్యాయవాది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై గురువాం ఢిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ (Senior Council Abhishek Manu Singhvi) వాదనలు వినిపించగా... ఈడీ (ED) తరపున న్యాయవాది జోయబ్ హోస్సేన్ (Advocate Zoeab Hossain) వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే కవితకు బెయిల్‌ను ఈడీ పూర్తిగా వ్యతిరేకించింది. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని.. బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు లాయర్ తెలిపారు.


‘‘కవిత చిన్నకొడుకు ఒంటరిగా ఏం లేడు. 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నాడు. కవితను ఆమె ముగ్గురు సిస్టర్స్ ములాఖత్ అయ్యారు. అబ్బాయి చూసుకోవాడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు, కానీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయి. కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు’’ అని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు.


కవితకు బెయిల్ ఇవ్వడం కేసు దర్యాప్తుకు ఆటంకం...

‘‘కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవిత. కవిత మొబైల్ ఫోన్లను మార్చారు. ఆధారాలు ధ్వంసం చేశారు. ఫోన్లలో సమాచారాన్ని డిలీట్ చేశారు. 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారు. మొత్తం 10 ఫోన్లను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపాం. 9 ఫోన్లను ఫార్మాట్ చేశారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది. కవిత బ్యాంకు ఖాతాలు, ఐటీఆర్ వివరాలు,కుటుంబ వ్యాపార వివరాలు ఇవ్వలేదు. ఫోరెన్సిక్ లాబ్ డేటా ప్రకారం 4 ఫోన్లు ఫార్మాట్ చేయబడ్డాయి. ఈ కేసులో వందల కొద్దీ డిజిటల్ పరికరాల్లో డేటా డిలీట్ చేయబడింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది.. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుంది. లిక్కర్ వ్యాపారంలో కవిత వాటా 33 శాతం. మాగుంట రాఘవరెడ్డి వాటా 33 శాతం. దినేష్ అరోరా అప్రూవర్ మారాకా అన్ని విషయాలు చెప్పాడు. వంద కోట్ల రూపాయలు కవిత ఆలోచన మేరకే ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చారు. బుచ్చిబాబు ఫోన్ నుంచి డేటా రికవరీ చేశాము. ఆ డేటా ఆధారంగా కవితను విచరించాము. అరుణ్ పిళ్ళైతో కవితను విచారించాము. అప్రూవల్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారు’’ అని న్యాయవాది జోయబ్ హోస్సేన్ వెల్లడించారు. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు. అలాగే కవితకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను తిరస్కరించాలని కోర్టును ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ కోరారు.


ఇవి కూడా చదవండి..

Delhi liquor Scam: ‘కొడుకుకు తల్లి మోరల్ సపోర్ట్ అవసరం’.. కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

Avinash Reddy Bail: అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 04 , 2024 | 04:35 PM