Share News

Amit Shah Live: ఎల్బీ స్టేడియంలో బీజేపీ విజయ సంకల్ప సభ.. ‘షా’ కీలక ప్రసంగం

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:38 PM

Amit Shah Public Meeting: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ జోరు పెంచింది. ఈ ఎన్నికల్లో 12 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ.. ఇందుకోసం వ్యూహ రచన చేస్తోంది. ఎన్నికల ముందు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు...

Amit Shah Live: ఎల్బీ స్టేడియంలో బీజేపీ విజయ సంకల్ప సభ.. ‘షా’ కీలక ప్రసంగం

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ జోరు పెంచింది. ఈ ఎన్నికల్లో 12 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ.. ఇందుకోసం వ్యూహ రచన చేస్తోంది. ఎన్నికల ముందు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మంగళవారం నాడు సికింద్రాబాద్ ఇంపీరియల్ గ్రౌండ్‌లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్‌తో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం నేరుగా ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. సభలో అమిత్ షా మాట్లాడుతున్నారు.. ఆ లైవ్‌ను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో చూడొచ్చు.


షా.. అదిరిపోయే స్పీచ్!

  • తెలంగాణలో 12పార్లమెంట్ సీట్లు గెలుస్తాం

  • బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే

  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కుంభకోణాల లిస్ట్ చదివిన అమిత్ షా

  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి స్పీకర్‌ను ఎంఐఎం నేతను చేసింది కాంగ్రెస్

  • కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు మేలు చేయదు

  • కాంగ్రెస్ పార్టీ 2జీ, కామన్ వెల్త్ గేమ్స్‌తో పాటు అనేక రంగాల్లో అవినీతికి పాల్పడింది

  • లేదంటే రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలి

  • బ్రష్టాచార్ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ

  • బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక అవినీతి కి పాల్పడింది

  • మోదీ పాలనపై విపక్షాలు 50పైసల అవినీతి ఆరోపణలు చేయలేవు

  • కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారిని మరింత పేదవాడిని చేసింది

  • మోదీ ఇచ్చిన అన్ని గ్యారెంటీ లను అమలు చేశాం

  • కాంగ్రెస్ హయాంలో రోజు పాకిస్థాన్ నుంచి మిలిటెంట్‌లు చొరబడేవారు..

  • కానీ గత పదేళ్లుగా రెండు సార్లు దేశంలో చొరబడి పేలుళ్ళకు పాల్పడితే పాకిస్థాన్‌లోకి చొచ్చుకు వెళ్లి బుద్ది చెప్పాం

  • సీఏఏ చట్టంతో ఏ ఒక్క దేశ పౌరుడి పౌరసత్వం పోదు

  • పౌరసత్వం ఇచ్చే చట్టం కానీ.. తీసేసే చట్టం కాదు

  • ఓవైసీ, ఖర్గేలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు

  • తెలంగాణాలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టులను ప్రజలకు వివరించాలి

  • ఇండియా కూటమి కేవలం కుటుంబ పార్టీల కూటమి

  • దేశం మొత్తం అభివృద్ధి చెందేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారు

  • గతంలో ఎవరూ చేయలేని చంద్రుడి దక్షిణ ధృవంపై మనదేశం ల్యాండర్ దిగింది

  • విజయం సాధించే వరకు ఏ బీజేపీ కార్యకర్త విశ్రమించకూడదు

  • ఇంటింటికి వెళ్లి మహిళలను కలి‌‌సి బీజేపీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి

  • వందేళ్ల స్వతంత్ర దినోత్సవం వరకు దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు అందరూ కష్టపడి పనిచేయాలి

  • ప్రతి కార్యకర్త తానే మోదీ అనుకుని పనిచేయాలి : అమిత్ షా

Updated Date - Mar 12 , 2024 | 04:55 PM