నియోజకవర్గంలో కానరాని అభివృద్ధి
ABN , Publish Date - Dec 14 , 2024 | 10:40 PM
మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి అగుపించడం లేదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.164 కోట్లతో నిర్మించ తలపెట్టిన గోదావరిపై అంతర్గాం వంతెన ఊసే లేదని, నిర్మించిన ఇంటి గ్రేటెడ్ మార్కెట్, ఐబీ గెస్ట్‌హౌజ్‌ను లేకుండా చేశాడన్నారు.
గర్మిళ్ల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి అగుపించడం లేదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.164 కోట్లతో నిర్మించ తలపెట్టిన గోదావరిపై అంతర్గాం వంతెన ఊసే లేదని, నిర్మించిన ఇంటి గ్రేటెడ్ మార్కెట్, ఐబీ గెస్ట్‌హౌజ్‌ను లేకుండా చేశాడన్నారు. పడ్తన్‌పల్లి లిఫ్ట్ చేపడితే దాదాపు 10 వేల ఎకరాలకు సాగు నీరు అందేదని, దానికి అతీగతి లేదన్నారు. మూడు మున్సిపాలిటీలకు ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల చొప్పున, ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నియోజకవర్గానికి మంజూరైన రూ.6.60 కోట్లు నిధులు వెనక్కిపోవడానికి ఎమ్మెల్యే కారణమన్నారు. చిన్నా చితకా పనులను చేపడుతూ పెద్ద మొత్తంలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే చెప్పుకుంటు న్నాడన్నారు.
మంచిర్యాల ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా కొట్లాటలు జరుగు తున్నాయని, తప్పు చేయని వారిని చేసినట్లు చిత్రీకరిస్తున్నారన్నారు. భూదాన్ భూములను తాము కాపాడితే ప్రైవేటు వ్యక్తులకు రోడ్డు కోసం రోడ్లు వేసి లైట్లు పెట్టించాడని పేర్కొన్నారు. ప్రజల ఇండ్ల ముందు రోడ్లు వేయని ఎమ్మెల్యే ప్రైవేటు వ్యక్తుల కోసం రోడ్లు వేసే ప్రతిపాదన ఎలా చేస్తారని ప్రశ్నించారు. వ్యాపారులను ఇబ్బందులు పెట్టాలని మార్కెట్‌లో రోడ్డు విస్తరణ చేపడుతున్నారని, వ్యాపారులు ఎమ్మెల్యేకు ఓట్లు వేయలేదని వారిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఇబ్బం దులకు గురి చేస్తున్నాడన్నారు.. ప్రతీ నెల పింఛన్‌లు ఇవ్వ డం లేదని, దీంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడు తున్నారన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయ లతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. తనపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సుపారీ ప్రయత్నం మేము చేయలేదని, గం జాయి, డ్రగ్స్‌తో యువతను తప్పుదారి పట్టించే ఆలోచనలు చేయలేదని పేర్కొన్నారు. తాను డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.12.56 కోట్లు నియోజకవర్గానికి కేటాయిస్తే దానిని కాంగ్రెస్ ప్రభుత్వం 23-02-2024న రద్దు చేసిందని, ఎం దుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోటాలోని సీడీపీ నిధులను 2023-24 సంవత్సరం కింద రూ.268.50 లక్షలను అప్రూప్ చేయించానని, అయినా ఆ పనులు ఎందుకు మొదలు పెట్టలేదో ఎమ్మెల్యే చెప్పాల న్నారు. నేను ఎమ్మెల్యేగా, ప్రేంసాగర్‌రావు ఎమ్మెల్సీగా ఉన్న ప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని, లేదంటే ప్రేంసాగర్‌రావు చెప్పిన విషయాన్ని అబద్దాలేనని ప్రజాక్షేత్రంలో ఒప్పుకోవా లన్నారు. పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, మున్సిపల్ ఫ్లోర్‌లీ డర్ అంకం నరేష్, నాయకులు తోట తిరుపతి, శ్రీనివాస్, తిరుపతి, మహ్మద్ తాజుద్దీన్, రవీందర్, శంకర్,పాల్గొన్నారు.