ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 29 , 2024 | 10:16 PM
సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట శిబిరంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్క్ ధరించగా, మహిళా ఉద్యోగులు వారికి రాఖీలు కట్టారు.

శ్రీరాంపూర్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట శిబిరంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్క్ ధరించగా, మహిళా ఉద్యోగులు వారికి రాఖీలు కట్టారు.
సీఎం అన్నగా భావించి రాఖీలు కట్టామని, ఇప్పటికైనా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అలాగే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ రావు అన్నారు. సమ్మె శిబిరానికి హాజరై మాట్లాడారు. తమ పార్టీ పక్షాన మద్దతు ఇచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, స్వామిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.