Share News

కమ్యూనిస్టు పార్టీది త్యాగాల చరిత్ర

ABN , Publish Date - Dec 29 , 2024 | 10:22 PM

భారత కమ్యూనిస్టు పార్టీది త్యాగాల చరిత్ర అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి శత వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా శ్రీరాంపూర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

కమ్యూనిస్టు పార్టీది త్యాగాల చరిత్ర

శ్రీరాంపూర్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): భారత కమ్యూనిస్టు పార్టీది త్యాగాల చరిత్ర అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి శత వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా శ్రీరాంపూర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. శంకర్‌ మాట్లాడుతూ దున్నే వాడికి భూమి అనే నినాదంతో 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో ఆవిర్భవించిన సీపీఐ అనేక యోధుల త్యాగాలతో అంచె లంచెలుగా ఎదిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజ లకు అండగా నిలిచి, ఆదరణ పొందుతుం దన్నారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచిన చరిత్ర పార్టీదని పేర్కొ న్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని, ప్రజలు ఆదరించాలని కోరారు. అనంతరం పార్టీ సీని యర్‌ నాయకులు ఆళ్ల లచ్చిరెడ్డి, నూకల రాజ య్య, జక్కుల రాజయ్య, కంచం పోషం, జాలి గం సంపత్‌లను సన్మానించారు. సీపీఐ కార్యవర్గ సభ్యుడు కారుకూరి నగేష్‌ కృష్ణకాలనీ కార్యాలయం వద్ద, జిల్లా సమితి సభ్యుడు చిలుక రాంచందర్‌ ఆధ్వర్యంలో పార్టీ జెండాలను ఎగుర వేశారు. సాయంత్రం కొత్తరోడ్డు నుంచి కటిక దుకాణాల వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సింగాపూర్‌ కార్యదర్శి రామన్న, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మేకల దాసు, నాయకులు ముష్కె సమ్మయ్య, బాజీసైదా, లింగం రవి, రేగుంట చంద్రకళ, మోత్కూరి కొమురయ్య, నర్సింగారావు, రవీందర్‌, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

తాండూర్‌, (ఆంధ్రజ్యోతి): తాండూర్‌ మండల కేంద్రంలో ఆదివారం సీపీఐ వంద సంవత్సరాల వేడుకలను నాయకులు నిర్వహించారు. ఐబీ లోని ఆంధ్రాబ్యాంకు నుంచి భగత్‌ సింగ్‌ భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించి జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేశారు. మండల కార్యదర్శి సాలిగామ సంతోష్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, సభ్యులు చంద్రశేఖర్‌, దాగం మల్లేష్‌, బొంతల లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 10:22 PM