ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:06 PM
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగు లు చేపట్టిన సమ్మె సోమవారం 21వ రోజుకు చేరుకుంది. బుర్రకథను చెబు తూ ఉద్యోగులు విసూత్న నిరసన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న విద్యా విధానంలో సేవా కార్యక్రమాలు, అదే విధంగా తాము ఎదుర్కొంటున్న సమ స్యలను వివరిస్తూ బుర్ర కథ రూపంలో వివరించారు.
నస్పూర్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగు లు చేపట్టిన సమ్మె సోమవారం 21వ రోజుకు చేరుకుంది. బుర్రకథను చెబు తూ ఉద్యోగులు విసూత్న నిరసన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న విద్యా విధానంలో సేవా కార్యక్రమాలు, అదే విధంగా తాము ఎదుర్కొంటున్న సమ స్యలను వివరిస్తూ బుర్ర కథ రూపంలో వివరించారు.
శిబిరాన్ని సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడు రంగు రాజేశం, నాయకులు మధుసూదన్ రావు, కనుకుంట్ల మల్లన్న తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. తమ సమస్యల సాధనకు ఆందోళనను ఉధృతం చేస్తామని జేఏసీ అధ్యక్షు రాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు తెలిపారు.