Share News

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన

ABN , Publish Date - Dec 24 , 2024 | 10:54 PM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నస్పూర్‌లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని గోదాం ఇన్‌చార్జి శంకర్‌కు వినతిపత్రం అందించారు.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన

నస్పూర్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నస్పూర్‌లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని గోదాం ఇన్‌చార్జి శంకర్‌కు వినతిపత్రం అందించారు. రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ద్వారా దుకాణాలకు పంపించే బస్తాల్లో తూకం తక్కువ వస్తుందన్నారు. 50కిలోల బస్తాలో 45 నుంచి 48 కిలోల బియ్యం వస్తోందన్నారు.

నాసిరకం రంగు మారిన బియ్యం వస్తోందని ఆరోపించారు. ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. సరైన తూకం లేకుండానే బియ్యం పంపిణీ చేయడంతో ప్రతీ నెల క్వింటాలు నుంచి రెండు క్వింటాళ్ళ వరకు నష్టం వస్తోందన్నారు. తమకు తగిన న్యాయం చేయాలని రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా చౌకధరల దుకాణాల డీలర్లు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుదమల్ల కృష్ణ, నస్పూర్‌, మంచిర్యాల, జైపూర్‌, మందమర్రి, హాజీపూర్‌ డీలర్ల సంఘం అఽధ్యక్షులు రవి, మహేందర్‌, ప్రసాద్‌, అనిల్‌, శంకర్‌లతోపాటు నస్పూర్‌, మంచిర్యాల, హాజీపూర్‌, మందమర్రి, జైపూర్‌ మండలాలకు చెందిన పలువురు డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 10:54 PM