కోనంపేట రోడ్డు నిర్మాణానికి అడ్డు చెప్పొద్దు
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:04 PM
నెన్నెల-కోనం పేట రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఉన్న ప్పటికీ అధికారులు పనులు నిలిపి వేయడంపై కోనం పేట గ్రామస్థులు మండిపడ్డారు. కుంటిసాకులతో రోడ్డు పనులకు అడ్డు చెప్పొద్దంటూ నెన్నెల రేంజ్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు.
నెన్నెల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నెన్నెల-కోనం పేట రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఉన్న ప్పటికీ అధికారులు పనులు నిలిపి వేయడంపై కోనం పేట గ్రామస్థులు మండిపడ్డారు. కుంటిసాకులతో రోడ్డు పనులకు అడ్డు చెప్పొద్దంటూ నెన్నెల రేంజ్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. రోడ్డు పనులకు అడ్డు చెప్పొదంటూ నినాదాలు చేశారు. కలెక్టర్, డీఎఫ్‌వో రావాలని డిమాండ్ చేస్తూ మూడు గంటల పాటు బైఠా యించారు. ఎఫ్‌ఆర్‌వో అందుబాటులో లేకపోవడంతో సెక్షన్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని, అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ కూడా గ్రామా నికి రాలేని దుస్థితి ఉందన్నారు. ఎడ్లబండ్లపై దవాఖానా లకు వెళ్లాల్సి వస్తోందని, సకాలంలో వైద్యం అందక పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయని పేర్కొన్నారు.
ఇటీవల రోడ్డు పనులు ప్రారంభం కావడంతో రిజర్వు ఫారెస్టులో పనులు చేయొద్దంటూ అటవీశాఖ అధికారు లు నిలిపివేశారన్నారు. కంకర లారీలను, యంత్రాలను పని స్థలానికి రాకుండా అడ్డుకోవడంతో నిలిచిపోయాయ న్నారు. రిజర్వు ఫారెస్టులో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు తీసుకున్న తరువా తనే పనులు చేపడుతున్నామని కాంట్రాక్టర్ పేర్కొన్నారు. రిజర్వు ఫారెస్టులో సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణా నికి పంచాయతీరాజ్ శాఖకు అనుమతులు ఉన్నాయని సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ తెలిపారు. పర్మిషన్ పొందిన పీఆర్ వారు కాకుండా ఐటీడీఏ పనులు చేపడు తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయ డం వల్లే నిలిపి వేశామన్నారు. ఐటీడీఏ పేరిట అనుమ తులు తెచ్చుకొని పనులు కొనసాగించుకోవాలని సూచిం చారు. కొడిపె శంకర్, రామ్‌టెంకి శ్రీనివాస్, తోడె బాపురెడ్డి, ప్రతాప్‌రెడ్డి, భికారి, జక్కయ్య పాల్గొన్నారు.