Share News

నర్సింగాపూర్‌ను కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దు

ABN , Publish Date - Dec 24 , 2024 | 10:51 PM

మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామాన్ని మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దని బీజేపీ నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు.

నర్సింగాపూర్‌ను కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దు

హాజీపూర్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామాన్ని మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దని బీజేపీ నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ కార్పొరేషన్‌ ప్రకటన చూసి నర్సింగాపూర్‌ గామంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు.

గ్రామంలోని ప్రజలు పూర్తిగా వ్యవసాయ, కూలీ పనిపై ఆధారపడి జీవిస్తున్నారని, గ్రామంలోని సుమారు 355 మంది ఉపాధిహామీ ప థకం కింద కూలీలుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. గ్రామాన్ని కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దన్నారు. బీజేపీ నాయకులు ఎనగందుల కృష్ణమూర్తి, బొలిశెట్టి తిరుపతి, లగిశెట్టి వెంకటి, సాంబారు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 10:51 PM