నాణ్యమైన భోజనం అందించేందుకే కామన్ మెనూ
ABN , Publish Date - Dec 14 , 2024 | 10:38 PM
గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచి కామన్ మెనూను ప్రారంభించిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ప్రభు త్వం ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.
లక్షెట్టిపేటరూరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచి కామన్ మెనూను ప్రారంభించిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ప్రభు త్వం ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురు కులాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు హాస్టళ్లలోని విద్యా ర్థుల వద్దకు వచ్చేటప్పుడు ఇంటి నుంచి, హోటళ్ల నుంచి ఎలాంటి ఆహారం తీసుకురావద్దని సూచించారు. పిల్లలు గురుకులాల్లో వండిన ఆహారం తినేలా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. నియోజకవర్గంలో 24 గంటలపాటు అందు బాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు స్పష్టం చేశారు. డీఆర్‌డీవో సంజీవ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రమాకళ్యాణి, వైస్ ప్రిన్సి పాల్ మహేశ్వర్‌రావు, సీఐ నరేందర్, ఎస్‌ఐ సతీష్, మున్సిపల్ ప్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
ఆసుపత్రి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను శనివారం జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజుల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు ఉం టాయన్నారు. ఆసుపత్రి వైద్యులు ఆకుల శ్రీనివాస్, సురేష్, పవిత్ర, కృష్ణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.