Share News

అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:04 PM

అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఐబీ చౌరస్తా లో సోమవారం వామపక్ష పార్టీల నాయకులు అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు.

అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఐబీ చౌరస్తా లో సోమవారం వామపక్ష పార్టీల నాయకులు అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు లాల్‌కుమార్‌, సంకె రవిలు మాట్లాడుతూ పార్లమెంట్‌లో అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలపై దేశంలో రాజ్యాంగానికి, ప్రజలకు ప్రమాదం ఏర్పడిందన్నారు.

రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. అమిత్‌షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేవరాజ్‌, లక్ష్మీకాంతం, శ్రీనివాస్‌, చాంద్‌పాషా, బ్రహ్మానందం, మంగ, తిరుపతి, శ్రీకాంత్‌, చరణ్‌, అరుణ, ప్రకాష్‌, రంజిత్‌ , మోహన్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:04 PM