Share News

వన్యప్రాణుల సంక్షరణపై అవగాహన

ABN , Publish Date - Dec 05 , 2024 | 10:57 PM

మం డలంలోని శివలింగాపూర్‌ గ్రామంలో గురువారం ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ అధికారి ప్రభాకర్‌ వన్య ప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, విద్యుత్‌ వైర్లు, ఉచ్చులు, ఉరులు బిగించి వన్యప్రాణులను చం పితే కఠినచర్యలు తీసుకొంటామన్నారు.

వన్యప్రాణుల సంక్షరణపై అవగాహన

చెన్నూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని శివలింగాపూర్‌ గ్రామంలో గురువారం ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ అధికారి ప్రభాకర్‌ వన్య ప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, విద్యుత్‌ వైర్లు, ఉచ్చులు, ఉరులు బిగించి వన్యప్రాణులను చం పితే కఠినచర్యలు తీసుకొంటామన్నారు. అడవు లను, వన్యప్రాణులను అందరు సంరక్షించాల న్నారు. మాజీ ఉపసర్పంచు సంపత్‌, బేస్‌ క్యాం పు సిబ్బంది, వాచర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన

మండలంలోని కిష్టంపేట గ్రామ సమీపంలోని అర్బన్‌ పార్కు (వన విహార్‌)ను పట్టణంలోని వాగ్దేవి పాఠశాల విద్యార్థులు సందర్శించారు. అటవీ శాఖ అధికారులు వన విహార్‌ గురించి వివరించారు. సీతాకోక చిలుకలు వాటి పేర్లు, వివిధ రకాల పక్షులు, మొక్కల గురించి తెలి పారు. అకిరామియావాకి అడవి గురించి వివరిం చారు. ఎఫ్‌ఆర్‌వో శివకుమార్‌, సెక్షన్‌ అధికారి అంజయ్య, ఎఫ్‌బీవోలు జ్యోతి,సంధ్య పాల్గొన్నారు.

అటవీ సంరక్షణ అందరి బాధ్యత

జన్నారం, (ఆంధ్రజ్యోతి): అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని ఉప అటవీ క్షేత్రాధికారి రాము పేర్కొన్నారు. గురువారం సింగారాయి పేట, దొంగపల్లి గ్రామాల్లోని ప్రజలకు అటవీ సంరక్షణపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రైతులు, ప్రజలు పంట పొలాల్లో, వ్యర్ధాలకు నిప్పు పెట్టినప్పుడు నిప్పురవ్వలు అట వీ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. తునికాకు సేకరణకు వెళ్లినప్పుడు ఎండిన ఆకులకు నిప్పు పెట్టవద్దని, బీడీలు, సిగ రెట్లు కాల్చి పడేయవద్దని సూచించారు. వన్యప్రా ణులు, అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌వో అజమత్‌, ఎఫ్‌బీవో కృష్ణ చైతన్య, రాజు, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 10:57 PM