Share News

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 10:41 PM

అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న తమ పార్టీకి చెందిన నాయకులపై దాడులకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. నస్పూర్‌ ప్రెస్‌ క్లబ్‌లో శని వారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

నస్పూర్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న తమ పార్టీకి చెందిన నాయకులపై దాడులకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. నస్పూర్‌ ప్రెస్‌ క్లబ్‌లో శని వారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18న తమ నాయకుడు నయీమ్‌ పాషాపై కొందరు దాడికి పాల్పడ్డా రన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై నామమాత్రపు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ విషయంపై సీపీకి ఫిర్యా దు చేయనున్నట్లు సుధాకర్‌ తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కోర్‌ కమిటీ సభ్యులు రాము గౌడ్‌, మజీద్‌, జిల్లా అధ్యక్షుడు నల్ల నాగేంద్రప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నయీమ్‌పాషా, రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు విజయ్‌ మల్లంగి, నాయకులు జునైద్‌, వికాస్‌, మేకల శ్రీనివాస్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 10:41 PM