లోక్‌అదాలత్‌లో 5,500 కేసుల పరిష్కారం
ABN , Publish Date - Dec 14 , 2024 | 10:35 PM
రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందని, ఏడు బెంచీలను ఏర్పాటు చేశామన్నారు.
గర్మిళ్ల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందని, ఏడు బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. 22 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారం కాగా, 51 బ్యాంకు కేసుల్లో రూ.33 లక్షలు రివకరీ అయ్యాయన్నారు. 5,500 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. మంచిర్యాల సెకండ్ డిస్ర్టిక్ లీగల్ సర్వీసెస్ అధారిటి జడ్జి అర్పిత మారంరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్‌రెడ్డి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సంపత్, ఫస్డ్ అడిషనల్ జ్యుడిషియన్ మెజిస్ర్టేట్ ఉపనిషద్వానా, సెకండ్ అడిషనల్ జుడిషియల్ మెజిస్ర్టేట్ నిరోష తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు, (ఆంధ్రజ్యోతి): లోక్‌అదాలత్‌లో 470 కేసులు పరిష్కారమ య్యాయని చెన్నూరు మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి తెలిపారు. కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో బ్యాంకు, సివిల్, క్రిమినల్ కేసులు రాజీపడడం జరిగిందన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో 227 కేసులు నమోదు కాగా జరిమానా విధించడం ద్వారా రూ. 4.54 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.
లక్షెట్టిపేటరూరల్, (ఆంధ్రజ్యోతి) : లోక్ అదాలత్‌లో కేసులు శాశ్వత పరిష్కారం అవుతాయని జూనియర్ సివిల్‌జడ్జి మహ్మద్ అసదుల్లా షరీఫ్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా కేసులు రాజీ పడితే రెండు వైపుల మేలు జరుగుతుందన్నారు. సీఐ నరేందర్, ఎస్‌ఐలు సతీష్, రాజవర్ధన్, ఉదయ్‌కిరణ్, సురేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, ఏజీపీ సత్యం, పాల్గొన్నారు.
బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి): రాజీ మార్గమే రాజమార్గమని బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ముఖేష్ అన్నారు. సివిల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిప్ప మనోహర్, సీఐలు అప్జలుద్దీన్, దేవయ్య, కుమారస్వామి, ఎస్‌ఐలు మహేందర్, రమేష్,ప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు.