Addanki Dayakar: ఆ రెండు విషయాల వెనుక బీజేపీ హస్తం
ABN , Publish Date - Mar 16 , 2024 | 09:19 PM
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ , బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ ఆ పార్టీకి రాజీనామా వెనక బీజేపీ ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్( Addanki Dayakar) అన్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ , బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ ఆ పార్టీకి రాజీనామా వెనక బీజేపీ ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్( Addanki Dayakar) అన్నారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ డ్రామా ఆడుతున్నాయని చెప్పారు. నోటిఫికేషన్ కంటే ముందే పొలిటికల్ డ్రామాను తెరమీదకు తెచ్చారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసును ఓ వెబ్ సిరీస్‌లా నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పొలిటికల్ డ్రామాను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని చెప్పారు. దక్షిణాదిన బలం పెంచుకునేందుకు బీజేపీ ఎత్తుగడ వేసిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుందని అద్దంకి దయాకర్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి