Share News

KCR Bus yatra: మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం

ABN , Publish Date - Apr 24 , 2024 | 06:44 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ( KCR Bus Yatra) కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో ప్రమాదం జరిగింది. 10కి పైగా వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం.

KCR Bus yatra: మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం
KCR

నల్గొండ,ఏప్రిల్ 24: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ( KCR Bus Yatra) కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాల్లో ఒకదానికొకటి ఢీకొన్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో ప్రమాదం జరిగింది. పదికి పైగా వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం.

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గల మిర్యాలగూడ వెళ్తున్నారు. ఓ వాహనాం.. సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.


Delhi Liquor Case: ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయా వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. వాహనాలు మితిమీరిన వేగం కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మే 7వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర జరగనుంది. లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర సాగనుంది.


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 07:07 PM