Share News

USB Charger Scam: పెచ్చుమీరిపోతున్న USB చార్జర్ స్కామ్.. సురక్షితంగా ఎలా ఉండాలంటే?

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:46 PM

ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా.. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి, అనేక మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిల్లో USB ఛార్జర్ స్కామ్ కూడా ఒకటి.

USB Charger Scam: పెచ్చుమీరిపోతున్న USB చార్జర్ స్కామ్.. సురక్షితంగా ఎలా ఉండాలంటే?

ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా.. సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ఏమాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి, అనేక మార్గాల్లో సైబర్ మోసాలకు (Cyber Crimes) పాల్పడుతున్నారు. అలాంటి వాటిల్లో USB ఛార్జర్ స్కామ్ (USB Charger Scam) కూడా ఒకటి.

IPL Fraud: ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు.. క్యూఆర్ కోడ్స్ పంపించి..

సాధారణంగా.. ఇంటి వద్ద తమ ఫోన్ ఛార్జర్ మర్చిపోయే జనాలు బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా విమానాశ్రయాలు, కేఫ్స్, హోటల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో అమర్చిన ఛార్జర్లను ఉపయోగిస్తుంటారు. ఈ ఛార్జింగ్ పోర్ట్‌లను దోపిడీ కోసం సైబర్ నేరగాళ్లు వినియోగిస్తారు. ఇన్‌ఫెక్టెడ్ USB స్టేషన్స్‌లో ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టినప్పుడు.. వినియోగదారులు ‘జ్యూస్-జాకింగ్’ సైబర్ దాడులకు గురవుతారు. ఈ జ్యూస్ జాకింగ్ అనేది సైబర్ దాడుల్లో ఒక వ్యూహం. ఇందులో సైబర్ నేరగాళ్లు యూజర్ ఫోన్లలోని డేటాని దొంగలించడం లేదా డివైజ్‌లలో మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేయడం వంటివి చేస్తారు.

Pawan Kalyan: వైసీపీ గుండెల్లో గుబులు.. భయంతో వారాహి విషయంలో ఏం చేసిందంటే?


ఇక డేటాని దొంగలించిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఏం చేస్తారో అందరికీ తెలిసిందేగా! ఫోన్ చేసి, తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతారు. ఒకవేళ డేటాని దొంగలించకుండా మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తే.. బ్యాంక్ వివరాలు సేకరించి, డబ్బులు కాజేస్తుంటారు. ఈమధ్య కాలంలో USB ఛార్జర్ స్కామ్ అనేది పెచ్చుమీరిపోతోంది. ఎంతోమంది ‘జ్యూస్-జాకింగ్’ దాడులకి గురయ్యారు. వ్యక్తిగత సమాచారంతో పాటు భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయారు. ఇటువంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నా తరుణంలో.. వినియోగదారులకు అధికారులు కొన్ని సూచనలను జారీ చేస్తున్నారు.

ఎలా సురక్షితంగా ఉండాలి?

బహిరంగ ప్రదేశాల్లోని ఛార్జింగ్ పోర్ట్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దు. ఎలక్ట్రికల్ వాల్ ఔట్‌లెట్స్‌ని ఎంపిక చేసుకోవాలి లేదా వ్యక్తిగత కేబుల్ & పవర్ బ్యాంక్‌లను తీసుకువెళ్లాలి. తెలియని డివైజ్‌లతో ఏమాత్రం జత చేయకూడదు. డివైజ్‌లను ఎప్పుడూ లాక్ చేసి ఉంచాలి. మొబైల్ ఫోన్ ఆఫ్‌లో ఉన్నప్పుడే ఛార్జ్ చేయడాన్ని పరిగణించాలి. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే.. www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలి. లేకపోతే 1930కి కాల్ చేయాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 06:46 PM