Share News

Pawan Kalyan: వైసీపీ గుండెల్లో గుబులు.. భయంతో వారాహి విషయంలో ఏం చేసిందంటే?

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:11 PM

ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని కూడా అధికార వైసీపీ విడిచిపెట్టడం లేదు. తన చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓటమి భయంతో అడుగడుగునా విపక్ష పార్టీల నాయకులకు ఆటంకాలు కలిగించడంపై దృష్టి సారించింది.

Pawan Kalyan: వైసీపీ గుండెల్లో గుబులు.. భయంతో వారాహి విషయంలో ఏం చేసిందంటే?

ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని కూడా అధికార వైసీపీ (YCP) విడిచిపెట్టడం లేదు. తన చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓటమి భయంతో అడుగడుగునా విపక్ష పార్టీల నాయకులకు ఆటంకాలు కలిగించడంపై దృష్టి సారించింది. తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఆ పార్టీ మరింత పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఇందుకు తాజా ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణ. గతంలో ‘వారాహి’ (Varahi) విషయంలో ఓవరాక్షన్ చేసిన వైసీపీ సర్కారు.. ఇప్పుడు అధికారుల చేత ఆ వాహనానికి అనుమతి లేదంటూ సరికొత్త నాటకానికి తెరలేపింది.

Kejriwal Arrest: ఆ వ్యూహాల కోసమే కేజ్రీవాల్ ఫోన్‌పై దృష్టి.. ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు


కాకినాడలో బహిరంగ సభ పాల్గొనేందుకు వారాహి వాహనంలో వెళ్లాలనుకున్న జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) అధికార పార్టీ ఆటంకం కలిగించింది. తన ప్రతి సభలోనూ ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు కాబట్టి.. అదే సెంటిమెంట్‌ని కాకినాడ సభలోనూ రిపీట్ చేయాలని భావించారు. ఆ వాహనంపై ఎక్కి, సభలో ప్రసంగించాలని నిర్ణయించారు. కానీ.. ఇంతలోనే వైసీపీ తెరవెనుక వ్యూహాలు పన్నింది. ఈ వాహనానికి అనుమతి ఇవ్వొద్దంటూ అధికారులకి ఆదేశాలు జారీచేసింది. దీంతో.. అధికారులు రంగంలోకి దిగి, వారాహి వినియోగానికి పర్మిషన్ ఇవ్వలేదు. తాము వారాహికి అనుమతులు ఇవ్వలేమని, చిన్నపాటి డీసీఎంకి మాత్రమే అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. ఎందుకని జనసేన నేతలు ప్రశ్నించగా.. అందుకు సరైన సమాధానం ఇవ్వలేదు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వారాహికి పర్మిషన్ ఇవ్వలేమని చెప్పారంతే!

IPL Fraud: ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు.. క్యూఆర్ కోడ్స్ పంపించి..

చివరికి ప్రయోజనం లేదనుకున్న పవన్ కళ్యాణ్.. వారాహిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. హోటల్ నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు నేరుగా వెళ్లిపోయారు. ఇది అధికార వైసీపీ ఆడుతున్న జగన్నాటకమని అర్థం చేసుకొని, పవన్ వేరే వాహనంలో వెళ్లారు. నిజానికి.. వారాహిలో వెళ్తే, పురోహుతిక అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించాలని పవన్ భావించారు. కానీ.. వారాహికి అనుమతి ఇవ్వకపోవడంతో, పూజలు రద్దు చేసుకొని, సభకు బయలుదేరారు. తప్పని పరిస్థితిలో మరో వాహనం ఎక్కి, పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 06:33 PM