Share News

Software Engineers: ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

ABN , Publish Date - May 24 , 2024 | 09:39 PM

ఇటివల కాలంలో ఏఐ (artificial intelligence) వచ్చిన తర్వాత పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలలో అనేక మంది ఉద్యోగులను తొలగించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో AI సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు(AI Software engineers) ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు వీరికి వేతనాలు కూడా అంతకు మించి పెరిగాయి.

Software Engineers: ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
Software engineers with AI skills are earning 50 per cent

ఇటివల కాలంలో ఏఐ (artificial intelligence) వచ్చిన తర్వాత పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలలో అనేక మంది ఉద్యోగులను తొలగించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో AI సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు(AI Software engineers) ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు వీరికి వేతనాలు కూడా అంతకు మించి పెరిగాయి. సాధారణ ఇంజినీర్లతో పోలిస్తే వీరికి 50 శాతం అధికంగా చెల్లిస్తుండటం విశేషం. గత నెలలో అమెరికాలో ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల సరాసరి వేతనం మూడు లక్షల డాలర్లకు చేరుకుంది. అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే దాదాపు రూ.2 కోట్ల 49 లక్షల 18 వేల 660గా ఉంది.


అయితే సాధారణ ఇంజినీర్లతో పోలిస్తే వీరి వేతనం లక్ష డాలర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2022లో ఈ ఉద్యోగుల మధ్య వేతనం 30 శాతం తేడా ఉండగా, ప్రస్తుతం అది 50 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం ఏఐ ఇంజినీర్లకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అగ్రశ్రేణి టెక్ సంస్థలు AI ప్రతిభ కలిగిన ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రాముఖ్యతనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాఫ్ట్ వేర్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ టెక్నాలజీ నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. నేర్చుకుంటేనే వారికి డిమాండ్ లేదంటే అంతే సంగతులు అన్నట్లుగా తయారైంది. ఈ క్రమంలో ఏఐ నైపుణ్యాలు ఉన్న వారికే కంపెనీలు అధిక వేతనాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి.


దీంతో ఉద్యోగ స్థాయితో సంబంధం లేకుండా AI నైపుణ్యానికి వ్యాపార సంస్థలు అధిక ప్రాముఖ్యతను ఇస్తు్న్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి టెక్ కంపెనీలు AIతోపాటు అనేక మార్పులను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నైపుణ్యాలు ఉన్నవారినే తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మరోవైపు ఇండియాలో AI అభివృద్ధిని ప్రోత్సహించేందుకు భారత AI మిషన్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని కింద ఐదేళ్లలో రూ.10,372 కోట్లు వెచ్చించాలని సిద్ధమైంది.


ఇది కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త


Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Read Latest Technology News and Telugu News

Updated Date - May 24 , 2024 | 09:44 PM