Share News

Redmi Note 13: నేడు మార్కెట్లోకి Redmi కొత్త 5జీ ఫోన్స్..ధర, ఫీచర్లు తెలుసా?

ABN , Publish Date - Jan 04 , 2024 | 02:08 PM

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Redmi Note 13 సిరీస్ ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. Redmi Note 13 సిరీస్‌లో మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

Redmi Note 13: నేడు మార్కెట్లోకి Redmi కొత్త 5జీ ఫోన్స్..ధర, ఫీచర్లు తెలుసా?

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Redmi Note 13 సిరీస్ ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. Redmi Note 13 సిరీస్‌లో మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వాటలో Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro Plus. ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లుగా విడుదలైన OnePlus Nord సిరీస్, Realme, iQOO మోడళ్లకు ఇది మంచి పోటీని ఇవ్వనుంది.


Redmi Note 13 Pro Plus 8GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తున్న వేరియంట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.31,999గా ఉంది. ఇక 12GB, 256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ రేటు రూ.33,999గా ప్రకటించారు. మరోవైపు 12GB RAM, 512GB స్టోరేజ్ కలిగిన మోడల్ ధర రూ.35,999గా పేర్కొన్నారు. ఈ మోడల్ ఫోన్లు Fusion Black, Fusion White, Fusion Purple కలర్లలో అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మి నోట్ 13 సిరీస్ ధర ప్రారంభ మోడల్‌ ధర రూ.16,999 నుంచి మొదలవుతుంది.


Redmi Note 13 Pro Plus, MediaTek Dimensity 7200 Ultra 5G సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఈ చిప్‌సెట్‌తో ప్రపంచంలోనే వస్తున్న మొదటి ఫోన్ ఇదే అవుతుందని కంపెనీ పేర్కొంది. 200MP మెయిన్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది 1.5K రిజల్యూషన్‌తో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండగా..దీని సహాయంతో ఫోన్‌ను 19 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం ఇది Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్, GPS వంటి సౌకర్యాలతో వస్తుంది. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో రెండు వేల రూపాయల డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. ICICI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Updated Date - Jan 04 , 2024 | 02:08 PM