Share News

Realme 12 Pro: క్రేజీ కెమెరాతో Realme 12 Pro సిరీస్..ఈనెలలోనే మార్కెట్లోకి విడుదల

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:44 PM

Realme 12 Pro series స్మార్ట్‌ఫోన్లు మరికొన్ని రోజుల్లో దేశీయ మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Realme 12 Pro: క్రేజీ కెమెరాతో Realme 12 Pro సిరీస్..ఈనెలలోనే మార్కెట్లోకి విడుదల

Realme స్మార్ట్‌ఫోన్లు మరికొన్ని రోజుల్లో దేశీయ మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే Realme 12 Pro ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ పోస్టర్లో ప్రముఖ లగ్జరీ వాచ్ బ్రాండ్ రోలెక్స్‌తో రియల్‌మి బ్రాండ్ సహకారం ఉందని తెలిపింది. పోస్టర్‌లో రియల్‌మీ 12 ప్రో, బ్లూ, గోల్డెన్ థీమ్‌లో రోలెక్స్ వాచ్ ఉన్నాయి.


దీంతోపాటు Realme 12 Pro 5G తన ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ మోడల్ హ్యాండ్‌సెట్‌ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. ఇది రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్‌లోని 200 ఎంపీ యూనిట్‌లలో బియాండ్ 200ఎమ్ అనే ట్యాగ్‌లైన్‌ను కల్గి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో ఈనెలలోనే లాంచ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ కచ్చితమైన తేదీని ఇంకా ఖరారు చేయలేదు.

ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే Realme 12 Pro+ మోడల్ 6.7 అంగుళాల FHD+ OLED (120Hz) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కొత్త Realme స్మార్ట్‌ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని వెల్లడించింది. ఇక బ్యాటరీ 5,000 mAh సామర్థ్యాన్ని కల్గి ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. కెమెరా విషయానికొస్తే ఇది 50 MP+8 MP+64 MP బ్యాక్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Updated Date - Jan 10 , 2024 | 03:44 PM