Share News

WhatsApp: వాట్సప్ చాట్ డిలేట్ అయిందా? కంగారు పడకండి.. ఇలా బ్యాకప్ చేయొచ్చు

ABN , Publish Date - May 18 , 2024 | 04:09 PM

ఏదో ఒక సందర్భంలో డిలేట్ అయిన వాట్సప్(WhatsApp) చాట్‌ని తిరిగి పొందాలని చూస్తాం. కానీ చాలా మందికి దాన్ని రిట్రైవ్ చేయడమెలాగో తెలీదు. అందులో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లు, ఫోటోలు, డాక్యుమెంట్లు తదితర కీలక సమాచారం ఉంటుంది.

WhatsApp: వాట్సప్ చాట్ డిలేట్ అయిందా? కంగారు పడకండి.. ఇలా బ్యాకప్ చేయొచ్చు

ఇంటర్నెట్ డెస్క్: ఏదో ఒక సందర్భంలో డిలేట్ అయిన వాట్సప్(WhatsApp) చాట్‌ని తిరిగి పొందాలని చూస్తాం. కానీ చాలా మందికి దాన్ని రిట్రైవ్ చేయడమెలాగో తెలీదు. అందులో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లు, ఫోటోలు, డాక్యుమెంట్లు తదితర కీలక సమాచారం ఉంటుంది.

కొన్ని పోలీస్ కేసుల్లో వాట్సప్ చాట్‌లు(WhatsApp Chat) సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన వాట్సప్ చాట్‌ను తిరిగి పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వాట్సప్ డిలేట్ అయిన చాట్‌లను డైరెక్ట్‌గా పొందే ఆప్షన్‌ లేదు. కానీ దానికి ప్రత్యామ్నయం ఉంది.


తిరిగి పొందడమిలా..

డిలేట్ అయిన వాట్సాప్ చాట్‌ని తిరిగి పొందడానికి, తప్పనిసరిగా కొన్ని సెట్టింగ్లు చేసుకోవాలి. లేదంటే చాట్‌ని తిరిగి పొందడం అసాధ్యం. ముందుగా ఫోన్లో చాట్ బ్యాకప్‌ని ఎనేబుల్ చేయాలి. బ్యాకప్ అయిన చాట్ పక్కాగా యాపిల్ లేదా గూగుల్ జీమెయిల్ అకౌంట్‌కి లింక్ చేసి ఉండాలి.

బ్యాకప్ ఫ్రీక్వెన్సీని డైలీకి సెట్ చేస్తే ఈ మధ్య మీరు చేసిన చాట్‌ని కూడా తిరిగి పొందగలరు. నిత్యం చాట్‌లను బ్యాకప్ చేయాలి, ఎందుకంటే చివరి బ్యాకప్ వరకు మాత్రమే చాట్‌లను పునరుద్ధరించగలరు. చాట్ బ్యాకప్ డిసేబుల్ చేసి ఉంటే, డిలేట్ అయిన చాట్‌ను తిరిగి పొందలేరు.

సెట్టింగ్‌లు చేశాక.. చివరి బ్యాకప్ ఇటీవలిదైతే, డిలేట్ అయిన చాట్‌లను ఎలా రిట్రైవ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.


  • బ్యాకప్ నుంచి చాట్‌ను కోల్పోతారు కాబట్టి ఏదైనా చాట్‌ని తొలగించిన వెంటనే బ్యాకప్ చేయవద్దు లేదా WhatsAppని బ్యాకప్ చేయడానికి ప్రయత్నించొద్దు.

  • ముందుగా ఫోన్‌లో వాట్సప్ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసి, దాన్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి.

  • ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, OTPని నమోదు చేయండి.

  • బ్యాకప్‌ని పునరుద్ధరించమని చెప్పినప్పుడు బ్యాకప్ ఖాతాను ఎంచుకోండి. అన్ని చాట్‌లను పునరుద్ధరించడానికి వాట్సప్‌కు అనుమతించండి.

  • అకౌంట్ లాగిన్ చేసేటప్పుడు చాట్ రిట్రైవ్ ఆప్షన్ కనిపించకపోతే కంగారు పడకండి. మళ్లీ యాప్‌ని అన్ ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.తరువాత మళ్లీ లాగిన్ చేయండి.

  • లాగిన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, చివరి బ్యాకప్ వరకు డిలేట్ అయిన అన్ని చాట్‌లను పొందుతారు.

Read Latest News and Technology News here

Updated Date - May 18 , 2024 | 04:24 PM