Share News

Google Pay: ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి.. గూగుల్ పే అదిరిపోయే ఫీచర్

ABN , Publish Date - May 23 , 2024 | 07:04 PM

గూగుల్ పే(Google Pay) వినియోగదారులకు గుడ్ న్యూస్. షాపింగ్‌ను సులభతరం చేయడానికి గూగుల్ మూడు కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.“ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి” అనే ఫీచర్ యూజర్లను అమితంగా ఆకర్షిస్తోంది.

Google Pay: ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి.. గూగుల్ పే అదిరిపోయే ఫీచర్

ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ పే(Google Pay) వినియోగదారులకు గుడ్ న్యూస్. షాపింగ్‌ను సులభతరం చేయడానికి గూగుల్ మూడు కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.“ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి” అనే ఫీచర్ యూజర్లను అమితంగా ఆకర్షిస్తోంది. రివార్డులు, సెక్యూరిటీ అనే మరో రెండు ఫీచర్లను సైతం గూగుల్ పే ప్రవేశపెట్టింది.

బై నౌ పే లేటర్..

ఇప్పుడు కొనుగోలు చేయండి, తరువాత చెల్లించండి.. అబ్బా.. ఆ పేరు వింటేనే ఎంత హాయిగా ఉందో కదా. ఈ ఫీచర్‌నే గూగుల్ పరిచయం చేసింది. ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే వినియోగదారుడు పూర్తి మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా తరువాత చెల్లించొచ్చు.

వాయిదాల రూపంలో కూడా పే చేయొచ్చు. వస్తువు కొనేటప్పుడే ఆ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ఫీచర్ అమెరికాలో అందుబాటులో ఉంది. భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో త్వరలోనే స్పష్టత రానుంది.


రివార్డులు

క్రెడిట్ కార్డుల వల్ల కలిగే రివార్డుల ప్రయోజనాలను గూగుల్ పే కొత్త ఫీచర్ ముందుగానే చూపిస్తుంది.

Aadhaar Card: గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్ వివరాలు ఇచ్చారా? అయితే కష్టాల్లో పడినట్లే

సెక్యూరిటీ ఫీచర్

ఆన్‌లైన్ పేమెంట్ చేసే సమయంలో సురక్షితమైన లావాదేలీల కోసం గూగుల్ పే ఆటోఫిల్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఇది వేలిముద్ర, స్క్రీన్ లాక్ పిన్, ఫేస్ స్కాన్ ద్వారా సేవ్ చేసిన కార్డ్ వివరాలతో యూజర్లను అనుమతిస్తుంది. తద్వారా పూర్తి కార్డు వివరాలను వెల్లడించే ముందు వారి పరికరాన్ని అన్‌లాక్ చేయమని యాప్ అడుగుతుంది. ఈ ఫీచర్‌తో మీ డివైజ్‌ ఇతరులు యాక్సెస్ అయి ఉంటే మీ కార్డును ఉపయోగించలేరు.

For More National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 07:04 PM