Share News

Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక

ABN , Publish Date - May 24 , 2024 | 06:29 PM

గూగుల్ క్రోమ్(Google Chrome) వినియోగదారులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్(CERT) టీమ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వారి తాజా వల్నరబిలిటీ నోట్ CIVN-2024-0170 సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ అనేక లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది.

Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక
CERT Warning For Google Chrome Users

గూగుల్ క్రోమ్(Google Chrome) వినియోగదారులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్(CERT) టీమ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వారి తాజా వల్నరబిలిటీ నోట్ CIVN-2024-0170 సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ అనేక లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ లోపాల ద్వారా హ్యాకర్లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను దోపిడీ చేస్తారని, ఆయా పరికరాలపై పూర్తి నియంత్రణను సాధిస్తారని తెలిపింది. దీంతోపాటు యాంగిల్, డాన్‌లో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో లోపాలను కూడా గుర్తించినట్లు రిపోర్ట్ తెలిపింది.


మెమోరీ కేటాయించబడిన ప్రాంతంలో ప్రోగ్రామ్ మరింత చురుకుగా ఉన్నట్లు కనిపించినప్పుడు సమస్యలు ఏర్పడుతాయని రిపోర్ట్ తెలిపింది. దీంతో ప్రోగ్రామ్ క్రాష్ కావచ్చు లేదా హ్యాకర్లు కోడ్‌ని ఇంజెక్ట్ చేయడం ద్వారా మీ బ్రౌజర్‌ని నియంత్రిస్తారని హెచ్చరించింది. ప్రోగ్రామ్ మెమరీలో కొంత భాగాన్ని ఖాళీ చేసి దానిని తర్వాత ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరుగుతుందని తెలిపింది. ఇది ప్రోగ్రామ్‌లను క్రాష్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుందని లేదా ఊహించని కోడ్‌ని అమలు చేయడానికి హ్యాకర్‌లను అనుమతిస్తుందని వెల్లడించింది.


CERT-in ప్రకారం హ్యాకర్ల ఇలాంటి దాడులు చేస్తే వినియోగదారులు సిస్టమ్‌పై పూర్తి నియంత్రణను కోల్పోతారని తెలిపింది. దీనిలో డేటాను దొంగిలించడం, మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం లేదా మరొక కంప్యూటర్‌పై దాడి చేయడం వంటివి ఉంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో Windows, Mac 125.0.6422.76/.77 రన్ వెర్షన్‌, Linux 125.0.6422.76 Chrome వెర్షన్‌లను అప్‌డేట్ చేయాలని తెలిపింది. ఈ ముప్పును నివారించడానికి Google Chrome వినియోగదారులు Chromeని అప్‌డేట్ చేయాలని సూచించింది.


ఇది కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త


Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Read Latest Technology News and Telugu News

Updated Date - May 24 , 2024 | 06:30 PM