Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Bumper Offer: రూ. 2000 కంటే తక్కువ ధరకే స్మార్ట్ వాచ్.. కళ్లు చెదిరే ఫీచర్స్ కూడా..

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:03 PM

Bumper Offers on Smart Watch: ఇప్పుడంతా స్మార్ట్ వాచ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది స్మార్ట్ వాచీలను(Smart Watch) ధరిస్తున్నారు. అయితే, ఈ స్మార్ట్ వాచ్‌ల ధర రూ. 2 వేలకు పైగానే ఉంది. అయితే, సమ్మర్ స్పెషల్ ఆఫర్స్(Summer Special Offers) ఇస్తున్నాయి ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్స్. రూ. 2000 కంటే తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ వాచ్‌లను అందిస్తోంది.

Bumper Offer: రూ. 2000 కంటే తక్కువ ధరకే స్మార్ట్ వాచ్.. కళ్లు చెదిరే ఫీచర్స్ కూడా..
Bumper Offers on Smart Watch

Bumper Offers on Smart Watch: ఇప్పుడంతా స్మార్ట్ వాచ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది స్మార్ట్ వాచీలను(Smart Watch) ధరిస్తున్నారు. అయితే, ఈ స్మార్ట్ వాచ్‌ల ధర రూ. 2 వేలకు పైగానే ఉంది. అయితే, సమ్మర్ స్పెషల్ ఆఫర్స్(Summer Special Offers) ఇస్తున్నాయి ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్స్. రూ. 2000 కంటే తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ వాచ్‌లను అందిస్తోంది. పైగా సూపర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ మొదలు, హార్ట్ రేట్, బీపీ చెకింగ్, ఆక్సీజన్ లెవల్స్ చెకింగ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. అమేజాన్ వెబ్‌సైట్ ఈ ఆఫర్లను అందిస్తోంది. మరి రూ. 2,000 కంటే తక్కువ ధరకే లభించే స్మార్ట్ వాచ్‌లు ఒకసారి చూద్దాం..

ఫైర్-బోల్డ్ నింజా: ఈ స్మార్ట్‌వాచ్‌ 1.83 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెంట్, 100 స్పోర్ట్స్ మోడ్‌ ఆప్షన్ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 19,999. అయితే, అమెజాన్ ఈ కామర్స్ సైట్‌లో 94 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 1,199కి కొనుగోలు చేయవచ్చు.

నాయిస్ స్మార్ట్‌వాచ్: 1.81 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్‌లో.. బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఇది 160 గంటల కంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది. అమెజాన్ వెబ్‌సైట్‌లో 82 శాతం డిస్కౌంట్‌తో కేవలం 1,099 రూపాయలకే కొనుగోలు చేయొచ్చు.

బోట్ వేవ్ కాల్ 2: ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.83 అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. అధునాతన బ్లూటూత్ కాలింగ్, DIY వాచ్ ఫేస్ స్టూడియో అందుబాటులో ఉంది. ఇందులో మీరు లైవ్ క్రికెట్ స్కోర్‌ను కూడా చూడవచ్చు. ఈ వాచ్‌ను 80 శాతం తగ్గింపుతో కేవలం రూ. 1,399 లకే కొనుగోలు చేయవచ్చు.

ఫైర్-బోల్ట్: 1.96 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్‌వాచ్‌లో గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఇది ఈ కామర్స్ వెబ్‌సైట్‌‌లో 85 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,549కే కొనుగోలు చేయవచ్చు.

నాయిస్ క్యాడెట్ మిలిటరీ: నాయిస్ స్మార్ట్ వాచ్‌లో 1.78 అంగుళాల డిస్ప్లే ఉంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. 74 శాతం తగ్గింపుతో కేవలం రూ. 1,799 లకు కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2024 | 02:03 PM