Share News

WPL 2024: రెండు పరుగుల తేడాతో RCB విజయం..శోభనా క్రేజీ రికార్డు

ABN , Publish Date - Feb 25 , 2024 | 06:39 AM

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024) రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు UP వారియర్స్‌ను రెండు పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన యూపీ 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.

WPL 2024: రెండు పరుగుల తేడాతో RCB విజయం..శోభనా క్రేజీ రికార్డు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో (WPL 2024) భాగంగా శనివారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore), యూపీ వారియర్స్(up warriorz) మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ(RCB) రెండు పరుగుల తేడాతో యూపీపై విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అలిస్సా హీలీ సారథ్యంలోని యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఆమిర్‌.. రియల్‌ హీరో


లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ(UP)కి మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్‌లో 5 పరుగులు చేసి అలిస్సా హీలీ ఔటైంది. ఆ క్రమంలోనే శోభన ఒకే ఓవర్‌లో ఇద్దరినీ అవుట్ చేసి యూపీ టాప్ ఆర్డర్‌కు షాక్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో RCB తరఫున శోభనా ఐదు మందిని ఔట్ చేసి ఔరా అనిపించుకుంది. దీంతో WPL రెండో సీజన్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో యూపీ టాస్ గెలిచి ముందుగా ఆర్‌సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆ క్రమంలో రిచా ఘోష్ 62 పరుగులు, సబ్బినేని మేఘన 53 పరుగులతో స్మృతి మంధాన నేతృత్వంలోని RCB జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 1, కెప్టెన్ మంధాన 13 పరుగులు చేశారు. యూపీ తరఫున రాజేశ్వరి గక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. దీప్తి, ఎక్లెస్టోన్, మెక్‌గ్రాత్, హారిస్‌లు ఒక్కో వికెట్ తీశారు.

Updated Date - Feb 25 , 2024 | 06:39 AM