Share News

Punjab Kings: సామ్ కరన్ vs జితేశ్ శర్మ.. వైస్ కెప్టెన్ వివాదం పంజాబ్ కింగ్స్ క్లారిటీ

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:31 PM

సాధారణంగా.. ఒక మ్యాచ్‌కి కెప్టెన్ దూరమైనప్పుడు, అతని స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న ఆటగాడు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అయితే.. ఏప్రిల్ 13వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ దూరమైనప్పుడు, సామ్ కరన్ ఆ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Punjab Kings: సామ్ కరన్ vs జితేశ్ శర్మ.. వైస్ కెప్టెన్ వివాదం పంజాబ్ కింగ్స్ క్లారిటీ

సాధారణంగా.. ఒక మ్యాచ్‌కి కెప్టెన్ దూరమైనప్పుడు, అతని స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న ఆటగాడు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అయితే.. ఏప్రిల్ 13వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కెప్టెన్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) దూరమైనప్పుడు, సామ్ కరన్ (Sam Curran) ఆ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో.. క్రీడాభిమానులందరూ షాక్‌కి గురయ్యారు. వైస్ కెప్టెన్ జితేశ్ శర్మ (Jitesh Sharma) అయినప్పుడు, సామ్ కరన్ జట్టుని ఎలా నడిపిస్తాడంటూ గగ్గోలు పెట్టారు. చివరికి పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ రంగంలోకి దిగి.. ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

YS Jagan: కోడికత్తి 2.0.. ఇదొక ఫ్లాప్ షో.. సినిమా స్టైల్‌లో ప్లాన్ చేశారు


అసలు విషయం ఏమిటంటే.. పంజాబ్ జట్టు వైస్ కెప్టెన్ జితేశ్ శర్మ అని ఈ టోర్నీ ప్రారంభం నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. టోర్నీ ప్రారంభ వేడుకలకు జితేశ్ హాజరవ్వడం, ఐపీఎల్ (IPL) కప్‌ని ఆవిష్కరించినప్పుడు ఇతర జట్ల సారథులతో కలిసి ఫోటోషూట్‌లో పాల్గొనడం చూసి.. అతడే వైస్ కెప్టెన్ అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. కాబట్టి.. ధవన్ అందుబాటులో లేనప్పుడు అతడే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కట్ చేస్తే.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్‌గా సామ్ కరన్ రంగంలోకి దిగాడు. సారథిగా అతడు జట్టుని నడిపించాడు. ఈ నేపథ్యంలోనే.. వైస్ కెప్టెన్ వివాదం తెరమీదకి వచ్చింది. జితేశ్ వైస్ కెప్టెన్ కదా, అతడ్ని కాదని సామ్ కరన్‌ని ఎందుకు కెప్టెన్ చేశారంటూ నెట్టింట్లో కామెంట్లు వచ్చాయి. దీంతో.. కింగ్స్ మేనేజ్‌మెంట్ దీనిపై స్పందించి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు భారీ దెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ దూరం

ఈ వ్యవహారంపై కోచ్ సంజయ్ బంగర్ (Sanjay Bhangar) మాట్లాడుతూ.. జితేశ్‌ శర్మ అధికారికంగా వైస్‌ కెప్టెన్ కాదన్నారు. కెప్టెన్ల సెమినార్‌, టోర్నీ ప్రారంభ సమావేశాలకు జితేశ్ హాజరు కావడం వల్ల, అతడే వైస్ కెప్టెన్ అని భావించారని చెప్పారు. గతేడాది సామ్ కరన్ జట్టుని నడిపించిన సందర్భాలున్నాయని, అతడే ధవన్‌కు డిప్యూటీ అని స్పష్టం చేశారు. టోర్నీ ప్రారంభ కార్యక్రమం సమయంలో యూకే నుంచి సామ్ కరన్ రావడానికి ఆలస్యమైందని.. దీనికితోడు కొన్ని ట్రైనింగ్‌ సెషన్స్‌కు హాజరుకావాలని కరన్ భావించాడని.. అందుకే అతడిని చెన్నైకి పంపించలేదని వెల్లడించాడు. ఆ కార్యక్రమానికి జట్టు నుంచి తప్పకుండా ప్రాతినిధ్యం వహించాలని ఐపీఎల్‌ సభ్యుడి సూచనల మేరకు జితేశ్‌ను పంపించామని స్పష్టం చేశారు. ధవన్‌ గైర్హాజరీలో సామ్ కరన్‌ జట్టును నడిపిస్తాడని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2024 | 01:34 PM