Share News

YS Jagan: కోడికత్తి 2.0.. ఇదొక ఫ్లాప్ షో.. సినిమా స్టైల్‌లో ప్లాన్ చేశారు

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:12 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కోడికత్తి 2.0 అని.. సినిమా స్టైల్‌లో దీన్ని ప్లాన్ చేశారని.. కానీ ఇది ఫ్లో షో అని దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన రాళ్ల దాడి కుట్రలో భాగమేనని ఆరోపించారు.

YS Jagan: కోడికత్తి 2.0.. ఇదొక ఫ్లాప్ షో.. సినిమా స్టైల్‌లో ప్లాన్ చేశారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) వ్యాఖ్యానించారు. ఇది కోడికత్తి 2.0 అని.. సినిమా స్టైల్‌లో దీన్ని ప్లాన్ చేశారని.. కానీ ఇది ఫ్లో షో అని దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన రాళ్ల దాడి కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయం వైసీపీకి (YCP) పట్టుకుందని.. ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాకు తెరలేపిందని అభిప్రాయపడ్డారు. జగన్‌, వెల్లంపల్లికి ఒకే చోట గాయాలయ్యాయని అన్నారు. అదే రాయి మళ్లీ జగన్‌ కాలుకు గాయం చేసిందని అన్నారు.

Elections 2024: త్వరలో రాష్ట్రంలో సంచలన ఘటనలు.. ముందే పసిగట్టిన నెటిజన్లు..


‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి జరిగిన ఘటనలో వైఎస్ జగన్ అద్భుతంగా నటించారని వెంకటరమణారెడ్డి తూర్పారపట్టారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో కరెంట్ ఉండదా? డ్రోన్ విజువల్స్ ఉండవా? అని ప్రశ్నించారు. ఈ డ్రామాలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. భారతి రెడ్డి (Bharati Reddy) డైరెక్షన్‌లోనే ఈ తతంగం సాగిందన్నారు. గతంలో కోడికత్తి ఘటనని ప్రజలు నమ్మలేదు కాబట్టే వైఎస్ వివేకాను (YS Viveka) హత్య చేయించారని చెప్పారు. వైఎస్ కుటుంబంలో కొందరికి ప్రాణహాని ఉందని.. కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని ఆనం హెచ్చరించారు.

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు భారీ దెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ దూరం

కాగా.. విజయవాడలో బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. దీంతో.. జగన్‌కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కి కూడా రాయి తగిలి స్వల్ప గాయమైనట్లు తెలిసింది. ఈ ఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. జగన్‌ నుదుటికి రెండు కుట్లు పడ్డాయని, గాయం తీవ్రమైంది కాదని అన్నారు. ఆయనకు ప్రమాదమేమీ లేదని, రెండు మూడు రోజుల్లో కోలుకుంటారని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2024 | 01:32 PM