Share News

IPL 2024: నేడు మధ్యాహ్నం KKR vs LSG మ్యాచ్..ఎవరు గెలుస్తారంటే

ABN , Publish Date - Apr 14 , 2024 | 08:24 AM

ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో గెలుపు అంచనాలను ఇక్కడ చుద్దాం.

IPL 2024: నేడు మధ్యాహ్నం KKR vs LSG మ్యాచ్..ఎవరు గెలుస్తారంటే
ipl 2024 KKR vs LSG 28th Match

ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య 28వ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ప్రస్తుత సీజన్‌లో ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. గత మ్యాచ్‌లో CSK చేతిలో KKR 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. KKR జట్టు ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, RCB, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.


మరోవైపు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్(LSG) ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. లక్నో జట్టు ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది. గత మ్యాచ్‌లో లక్నో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లక్నో జట్టు ఎలాగైనా KKR జట్టును ఓడించాలని భావిస్తోంది. ఈ క్రమంలో KKR తమ సొంత మైదానంలో ఆటను సద్వినియోగం చేసుకోవాలని చూస్తుండగా, లక్నో మాత్రం కట్టడి చేయాలని చూస్తోంది.


ఇక గూగుల్ గెలుపు అంచనా(google win prediction) ప్రకారం ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 57 శాతం గెలిచే అవకాశం ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 43 శాతం ఛాన్స్ ఉంది. అయితే ఈ అంచనాలు పక్కాగా నిజం అవుతాయని చెప్పలేం.

కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్టులో ప్రాబబుల్ ప్లేయర్లలో ఫిలిప్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి కలరు.

లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టులో ప్రాబబుల్ ప్లేయర్లలో క్వింటన్ డి కాక్, KL రాహుల్ (c & wk), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్ ఉన్నారు.


ఇది కూడా చదవండి:

గట్టెక్కిన రాజస్థాన్‌ ఆఖరి ఓవర్‌లో విజయం


6 బంతుల్లో.. 6 సిక్స్‌లు


మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 08:28 AM