Share News

6 బంతుల్లో.. 6 సిక్స్‌లు

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:41 AM

నేపాల్‌ బ్యాటర్‌ దీపేంద్ర సింగ్‌ ఐరీ ఒకే ఓవర్‌లో ఆరు వరుస సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన మూడో బ్యాటర్‌గా...

6 బంతుల్లో..   6 సిక్స్‌లు

6 బంతుల్లో.. 6 సిక్స్‌లు

నేపాల్‌ బ్యాటర్‌ దీపేంద్ర రికార్డు

అల్‌ అమీరత్‌ (ఖతార్‌): నేపాల్‌ బ్యాటర్‌ దీపేంద్ర సింగ్‌ ఐరీ ఒకే ఓవర్‌లో ఆరు వరుస సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన మూడో బ్యాటర్‌గా సింగ్‌ రికార్డులకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్‌ క్‌పలో కతార్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. 2007 టీ20 వరల్డ్‌క్‌పలో బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ సింగ్‌ ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదగా.. 2021లో శ్రీలంకతో మ్యాచ్‌లో స్పిన్నర్‌ ధనంజయ బౌలింగ్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఈ రికార్డును సాధించాడు. వన్డేల్లో గిబ్స్‌ (సౌతాఫ్రికా), జస్‌కరణ్‌ మల్హోత్రా (యూఎస్‌) కూడా ఈ ఫీట్‌ను నమోదు చేశారు. కాగా, దీపేంద్ర నిరుడు మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 9బంతుల్లోనే అర్ధసెంచరీ బాది రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే.

Updated Date - Apr 14 , 2024 | 01:41 AM