Share News

Ranji trophy 2024: 42వ సారి రంజీ ట్రోఫీ గెల్చుకున్న ముంబై

ABN , Publish Date - Mar 14 , 2024 | 02:05 PM

రంజీ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ఎట్టకేలకు మళ్లీ ముంబై జట్టు 42వ సారి టైటిల్ గెల్చుకుంది. ఈ టోర్నీలో చివరి రౌండ్‌ వరకు విదర్భ ముంబయికి గట్టి పోటీ ఇచ్చినా కూడా గెలవలేక పోయింది.

Ranji trophy 2024: 42వ సారి రంజీ ట్రోఫీ గెల్చుకున్న ముంబై

రంజీ కప్ 2024(ranji trophy 2024) ఫైనల్ మ్యాచ్‌లో ఎట్టకేలకు మళ్లీ ముంబై(mumbai team) జట్టు 42వ సారి టైటిల్ గెల్చుకుంది. ఈ టోర్నీలో చివరి రౌండ్‌ వరకు విదర్భ ముంబయికి గట్టి పోటీ ఇచ్చినా కూడా గెలవలేక పోయింది. ఫైనల్లో అజింక్యా రహానే సారథ్యంలో ముంబై 169 పరుగుల తేడాతో విదర్భపై(vidarbha) విజయం సాధించింది. ఫైనల్‌లో విదర్భ విజయానికి 538 పరుగులు చేయాల్సి ఉంది.

కానీ ఛేజింగ్‌లో విదర్భ జట్టు 368 పరుగులకు ఆలౌటైంది. విదర్భ తరఫున కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా హర్ష్ దూబే 65 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై 42వ సారి విజేతగా నిలిచింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Election Commission: కేంద్ర కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు నియామకం


అయితే ఛాంపియన్‌గా నిలవాలంటే జట్టు మరో 290 పరుగులు చేయాల్సి ఉండగా, తనుష్ కోటియన్ అక్షయ్‌ను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేసి ఐదో రోజు ముంబై మళ్లీ మ్యాచ్‌ను తన చేతిలోకి తీసుకుంది. ఆ క్రమంలో తనుష్ కోటియన్ 4, తుషార్ దేశ్‌పాండే 2, ముషీర్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టి అద్భుతంగా బౌలింగ్ చేశారు. తన చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన ముంబై పేసర్ ధావల్ కులకర్ణి, ఉమేష్ యాదవ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి దేశవాళీ క్రికెట్‌లో అతని రిటైర్మెంట్‌ను మరోసారి గుర్తుండిపోయేలా చేశాడు.

రంజీల్లో ముంబైకి ఇది 42వ టైటిల్ కావడం విశేషం. 2015-2016 సీజన్‌లో సౌరాష్ట్రను ఓడించిన ముంబై తొలిసారి రంజీ టైటిల్‌ను గెలుచుకుంది. రంజీ ట్రోఫీని అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టు కూడా ముంబైనే. ఎనిమిది సార్లు టైటిల్ గెలిచిన కర్ణాటక రెండో స్థానంలో ఉంది.

Updated Date - Mar 14 , 2024 | 02:26 PM