Share News

Ishan Kishan: ఇషాన్‌ ధిక్కారం.. ద్రవిడ్, జై షా ఆదేశాలు బేఖాతర్..

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:50 AM

Ishan Kishan: హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదేశాలను వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ బేఖాతరన్నాడు. మానసిక సమస్యలతో సుదీర్ఘకాలంగా విశ్రాంతి

Ishan Kishan: ఇషాన్‌ ధిక్కారం.. ద్రవిడ్, జై షా ఆదేశాలు బేఖాతర్..
Ishaan Kishan News

ద్రవిడ్‌, జై షా ఆదేశాలు బేఖాతర్‌

రంజీ మ్యాచ్‌ ఆడని కిషన్‌

న్యూఢిల్లీ: హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదేశాలను వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ బేఖాతరన్నాడు. మానసిక సమస్యలతో సుదీర్ఘకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న ఈ జార్ఖండ్‌ ఆటగాడు..పునరాగమనానికి రంజీట్రోఫీ ఆడి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలని ద్రవిడ్‌, జై షా చేసిన సూచనను పట్టించుకోలేదు. రాజస్థాన్‌తో శుక్రవారం జంషెడ్‌పూర్‌లో మొదలైన జార్ఖండ్‌ గ్రూప్‌ ‘ఎ’ రంజీ ఆఖరి పోరు ఆడాలని కిషన్‌ను వారు ఆదేశించారు. కానీ అందుకు బదులుగా అతడు హార్దిక్‌ పాండ్యాతో కలిసి బరోడాలో సాధన చేస్తున్నాడు.

Updated Date - Feb 17 , 2024 | 08:05 AM