Virat Kohli: PBKSపై RCB గెలుపు.. విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డ్
ABN , Publish Date - May 10 , 2024 | 07:05 AM
ఐపీఎల్ 2024(IPL 2024)లో పంజాబ్ కింగ్స్‌పై నిన్న RCB జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతంగా బ్యాటింగ్ చేసి 92 పరుగుల ఇన్నింగ్స్ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో పంజాబ్ కింగ్స్‌పై నిన్న RCB జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతంగా బ్యాటింగ్ చేసి 92 పరుగుల ఇన్నింగ్స్ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. పంజాబ్ కింగ్స్‌పై ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. దీంతో ఐపీఎల్ లీగ్‌లో మూడు జట్లపై 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలిచాడు.
మూడు జట్లపై వెయ్యి పరుగులు
కోహ్లీ పంజాబ్ కింగ్స్‌పై 92 పరుగుల ఇన్నింగ్స్ ఆడడంతో ఈ జట్టుపై ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా కోహ్లీ 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు పూర్తి చేశాడు. ఇప్పుడు పంజాబ్‌పై కూడా చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ లీగ్‌లో రెండు జట్లపై 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ రికార్డులను కోహ్లీ వెనక్కి నెట్టాడు.
ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్టుపై వెయ్యికిపైగా పరుగులు
1030 పరుగులు - కోహ్లీ vs DC
1030 పరుగులు – కోహ్లీ vs PBKS
1006 పరుగులు - కోహ్లి vs CSK
1134 పరుగులు – వార్నర్ vs PBKS
1093 పరుగులు - వార్నర్ vs KKR
1051 పరుగులు – రోహిత్ vs KKR
1034 పరుగులు – రోహిత్ vs DC
1057 పరుగులు – ధావన్ vs CSK
ఐపీఎల్‌లో రెండోసారి తొంభైలలో కోహ్లీ ఔట్
పంజాబ్‌పై 92 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ ఔట్ అయ్యాడు. తొంభైలలో అతను ఔట్ కావడం IPLలో ఇది రెండోసారి. ఈ లీగ్‌లో ఇప్పటికే తొంభైలలో రెండుసార్లు ఔటైన గేల్, కేఎల్ రాహుల్, డుప్లెసిస్‌లను సమం చేశాడు. ఐపీఎల్‌లో తొంభైలలో డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, రుతురాజ్ గైక్వాడ్ అత్యధిక సార్లు ఔట్ అయ్యారు.
90 స్కోర్‌లో ఐపీఎల్‌లో అత్యధిక అవుట్‌లు
3 - డేవిడ్ వార్నర్
3 - గ్లెన్ మాక్స్వెల్
3 – రీతురాజ్ గైక్వాడ్
2 - క్రిస్ గేల్
2 – కేఎల్ రాహుల్
2 – ఫాఫ్ డు ప్లెసిస్
2 -విరాట్ కోహ్లీ
ఇది కూడా చదవండి:
ఒలింపిక్స్ నుంచి బజ్‌రంగ్ అవుట్
Read Latest Sports News and Telugu News