Share News

IPL 2024: రేపటి క్వాలిఫైయర్1.. KKR vs SRH మ్యాచులో ఎవరు గెలుస్తారు.. ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN , Publish Date - May 20 , 2024 | 06:46 PM

ఐపీఎల్ 2024(IPL 2024)లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ 1లో టేబుల్ టాప్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), రెండో ర్యాంకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మధ్య రేపు (మే 21) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది, స్టేడియం పిచ్ ఎలా ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం.

IPL 2024: రేపటి క్వాలిఫైయర్1.. KKR vs SRH మ్యాచులో ఎవరు గెలుస్తారు.. ప్రిడిక్షన్ ఎలా ఉందంటే
ipl 2024 Qualifier 1 Who will win KKR vs SRH

ఐపీఎల్ 2024(IPL 2024)లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ 1లో టేబుల్ టాప్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), రెండో ర్యాంకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మధ్య రేపు (మే 21) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుటుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది, స్టేడియం పిచ్ ఎలా ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం. ఇక లీగ్ దశలో KKR 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‌లలో 17 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచి క్వాలిఫయర్ 1కి అర్హత సాధించింది.


అహ్మదాబాద్‌(ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు స్వర్గధామం. కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు ఆరంభంలో అద్భుతాలు చేయగలరు. తర్వాత ఈ పిచ్ స్పిన్నర్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ లక్ష్యాన్ని ఛేదించడం ఎల్లప్పుడూ సులభమని చెప్పవచ్చు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్ తేలికగా మారుతుంది. అహ్మదాబాద్‌లో, టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ మొదట బౌలింగ్ చేసేందుకు ఇష్టపడతారు. ఈ స్టేడియంలో వర్షం పడే అవకాశం లేనప్పటికీ మ్యాచ్ జరిగే రోజు ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని తెలుస్తోంది.


నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 33 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఛేజింగ్ జట్టు 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 168 పరుగులు కాగా, గుజరాత్ టైటాన్స్(GT) vs ముంబై ఇండియన్స్(MI) మ్యాచ్‌లో చేసిన అత్యధిక స్కోరు 233 పరుగులు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇక్కడ 6 మ్యాచ్‌లు ఆడగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఛేజింగ్ జట్టు 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.


ఇక కేకేఆర్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు ఇప్పటి వరకు 26 మ్యాచ్‌ల్లో తలపడగా, కోల్‌కతా 17 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో రెండు జట్లు ఒక్కసారి తలపడగా అందులో కేకేఆర్ గెలిచింది. ప్రస్తుతం రెండు జట్లూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే ఈ మ్యాచులో ఇరు జట్లు కూడా 50 శాతం గెలిచే అవకాశం ఉందని తెలిపింది.


కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ప్రాబబుల్ 11లో రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కలరు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ప్రాబబుల్ 11లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (wk), షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్ ఉన్నారు.


ఇది కూడా చదవండి:

EPFO: మీరు ఏ వయస్సులో ముందస్తు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు?


Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read latest Sports News and Telugu News

Updated Date - May 20 , 2024 | 06:51 PM