Share News

Sania Mirza: మహిళల విజయంపై కంపెనీ యాడ్.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆసక్తికర పోస్ట్

ABN , Publish Date - Mar 02 , 2024 | 12:28 PM

సమాజంలో మహిళలు సాధించే విజయాలను ఎలా చిన్న చూపు చూస్తారనే అంశంపై భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ ఉన్న లింగ వివక్షపై ఆమె విచారం వ్యక్తం చేశారు. టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సానియా మిర్జా కొన్ని నెలల క్రితం భర్త నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.

Sania Mirza: మహిళల విజయంపై కంపెనీ యాడ్.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆసక్తికర పోస్ట్

సమాజంలో మహిళలు సాధించే విజయాలను ఎలా చిన్న చూపు చూస్తారనే అంశంపై భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ ఉన్న లింగ వివక్షపై ఆమె విచారం వ్యక్తం చేశారు. టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సానియా మిర్జా కొన్ని నెలల క్రితం భర్త నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల సానియా మిర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్(Shoaib Malik) మరో వివాహం కూడా చేసుకున్నాడు. అయితే స్త్రీ విజయాన్ని సమాజం ఎలా తక్కువ చేస్తుందో చూపించే ఓ ప్రకటనపై సానియా స్పందించారు. తన ఎక్స్ ఖాతా వేదికగా సదరు ప్రకటనపై ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఘటనల గురించి కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘2005లో డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచిన మొదటి భారత మహిళగా నేను నిలిచాను. అది గొప్ప విజయమే కదా.. డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ 1 ప్లేయర్‌గా నిలిచాను. నేను ఎప్పుడు స్థిరపడతానో అని ప్రజలు ఆసక్తిగా చూశారు. నేను ఆరు గ్రాండ్‌ స్లామ్‌లు గెలిచిన అది సమాజానికి సరిపోలేదు. నా కెరీర్‌లో నాకు చాలా మంది మద్దతుగా నిలిచారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించి ఎందుకు చర్చిస్తారనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ ప్రకటన చూసిన తర్వాత నా మనసులో చాలా భావాలు మెదిలాయి. ఈ సమాజంలో వాస్తవాల గురించి మాట్లాడడం కష్టమని నాకు తెలుసు. కానీ ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ అది ఎప్పటికీ జరుగుతుందో’’ అని ఆమె ట్వీట్ చేశారు.

Lok Sabha elections 2024: ఆ వార్తలను ఖండించిన క్రికెటర్ యువరాజ్ సింగ్



సానియా మీర్జాను అంతగా ఉద్వేగానికి గురి చేసిన ఆ ప్రకటన ఏంటనే విషయానికొస్తే.. అర్బన్ కంపెనీ ఇటీవల చోటీ సోచ్- సంకుచిత ఆలోచనలు పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరికీ తాము చేస్తున్న పని పట్ల గర్వంగా ఉంటుందని, దాన్ని ఇతరులు కూడా గౌరవించాలనే స్పూర్తిదాయక సందేశంతో ఆ ప్రకటన ఉంది. ఆ ప్రకటనలో బ్యూటీషియన్‌గా పని చేస్తూ ఓ మహిళ కారు కొనుగోలు చేస్తుంది. అది చూసిన ఇరుగుపొరుగువారు ఆమె వృత్తిని చులకన చేస్తారు. దాన్ని ఆమె తమ్ముడు అవమానంగా భావిస్తాడు. దీంతో సదరు మహిళ తన సోదరుడితో ప్రతి ఒక్కరు తాను కొన్న కారునే చూస్తున్నారని, కానీ దాను వెనుక ఉన్న తన కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదని చెబుతోంది. మహిళ విజయం సాధించిన ప్రతిసారీ ఈ సమాజం కించపర్చాలనే చూస్తోందని, అలాంటి వారి మాటలను పట్టించుకుని మన జీవితాన్ని వదులుకోవాలా? కష్టపడి ముందుకు సాగాలా? అనేది మన నిర్ణయమే అని చెబుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 12:31 PM