Share News

Rohit Sharma: 12th ఫెయిల్ సినిమాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:29 PM

ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 12th ఫెయిల్ సినిమాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. సినిమా చూసిన హిట్‌మ్యాన్ చాలా బాగుందంటూ కొనియాడాడు. ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సిద్దమవుతున్నాడు.

Rohit Sharma: 12th ఫెయిల్ సినిమాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు

ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 12th ఫెయిల్ సినిమాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. సినిమా చూసిన హిట్‌మ్యాన్ చాలా బాగుందంటూ కొనియాడాడు. ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సిద్దమవుతున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. దీంతో దొరికిన ఈ కొద్దీ విరామంలో రోహిత్ శర్మ ఓ షోలో పాల్గొన్నాడు. మందిరా బేడీ హోస్ట్ చేసిన ఆ షోలో రోహిత్ శర్మకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా సినిమా లేదా షో చూశారా అని మందిరా బేడీ అడిగింది. దీనికి సమాధానంగా తాను 12th ఫెయిల్ సినిమా చూశానని రోహిత్ శర్మ చెప్పాడు. దానికి స్పందించిన బేడీ ఆ సినిమా స్ఫూర్తిదాయకం అని పేర్కొంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ అవును, అది చాలా మంచి సినిమా అని ప్రశంసలు కురిపించాడు.


మొత్తంగా 12th ఫెయిల్ సినిమా హిట్‌మ్యాన్ మనసు దోచుకుంది. ఒక ఐపీఎస్ అధికారి కథ రోహిత్ శర్మకు తెగ నచ్చేసింది. ఈ షోకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 27 అక్టోబర్ 2023న విడుదలైన 12th ఫెయిల్ సినిమా మంచి విజయం సాధించింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ప్రశంసలు అందుకుంది. మనోజ్ కుమార్ అనే ఒక ఐపీఎస్ అధికారి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మస్సే ప్రధానపాత్రలో నటించాడు. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. నిర్మాతగా కూడా ఆయనే ఉన్నాడు. శంతను మొయిత్రా సంగీతాన్ని అందించగా రంగరాజన్ రామబద్రం సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించాడు. 12వ తరగతి ఫెయిల్ అయిన ఒక పేద విద్యార్థి ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడనేదే ఈ సినిమా కథ. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ సినిమా ఇప్పటికే అనేక అవార్డులకు కూడా కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచేందుకు పోటీపడుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 02:29 PM