IPL 2024: ప్రముఖ కామెంటేటర్ రీఎంట్రీ.. ఒక రోజుకు రూ.25 లక్షల పారితోషికం
ABN , Publish Date - Mar 19 , 2024 | 06:17 PM
ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు రీఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తన వ్యాఖ్యానం ఇవ్వనున్నాడు. 10 ఏళ్ల క్రితం క్రికెట్ కామెంటేటర్‌గా తప్పుకుని రాజకీయాల్లో బిజీ అయిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ సిద్ధు మళ్లీ మైక్ పట్టనున్నాడు.
ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు రీఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తన వ్యాఖ్యానం ఇవ్వనున్నాడు. 10 ఏళ్ల క్రితం క్రికెట్ కామెంటేటర్‌గా తప్పుకుని రాజకీయాల్లో బిజీ అయిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ సిద్ధు మళ్లీ మైక్ పట్టనున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024లో తన వాక్చాతుర్యంతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకోనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సిద్ధునే వెల్లడించాడు. 60 ఏళ్ల సిద్ధు తన మొదటి లవ్ క్రికెట్ అని చెప్పాడు. మన అభిరుచి వృత్తిగా మారితే దానికంటే గొప్పది మరొకటి లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా గతంలో టోర్నీ మొత్తానికి రూ.60 నుంచి 70 లక్షలు తీసుకునే తాను ఐపీఎల్‌లో ఒక రోజుకు రూ.25 లక్షలు తీసుకోనున్నట్టు చెప్పాడు. సిద్ధు మాట్లాడుతూ ‘‘నా ఫస్ట్ లవ్ క్రికెట్. మీ అభిరుచి మీ వృత్తిగా మారితే దానికంటే గొప్పది మరొకటి లేదు. బాతు పిల్ల ఈత కొట్టడం ఎప్పటికీ మరిచిపోదు. చేపకు ఈత నేర్పడం ఎలాంటిదో తనకు ఎవరైన కామెంట్రీ గురించి కొత్తగా చెప్పడం కూడా అలాంటిదే. గ్యాప్ వచ్చిన నా మాటల పదును ఏమాత్రం తగ్గదు.
నా జీవిత రహస్యం ఏమిటంటే స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చేయడం. రాజకీయాల నుంచి స్విచ్ ఆఫ్ చేయడం నాకు చాలా కష్టమైంది. కష్టం ఒకేసారి వస్తుంది. అసాధ్యమైన దానికి కొంచెం సమయం పడుతుంది. నా మానసిక ధృఢత్వమే నన్ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా నడిపిస్తుంది. క్రికెట్‌లో నేను 20 సార్లు రీఎంట్రీ ఇచ్చాను. కానీ కామెంట్రీలో మాత్రం ఇదే నా మొదటి రీఎంట్రీ. నేను క్రికెట్‌ను విడిచిపెట్టి వ్యాఖ్యానంలో చేరినప్పుడు ఇది చేయగలను అని నాకు తెలియదు. నాకు నమ్మకం లేదు. కానీ ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో కూడా అదరగొట్టడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో సిద్ధూయిజం అనే పదం వచ్చింది. నేను ఒక దారిలో వెళ్తున్నాను. ఆ దారిలో ఎవరూ నడవడం లేదు. నేను గతంలో మొత్తం టోర్నీలో రూ.60 నుంచి 70 లక్షలు పారితోషికంగా తీసుకోనేవాడిని. కానీ ఈ ఐపీఎల్‌లో రోజుకు 25 లక్షలు తీసుకుంటాను. అయితే ఐపీఎల్‌లో కేవలం డబ్బుతోనే సంతృప్తి దొరకదు. ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపడం సరదాగా ఉంటుంది. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 కంటే ముందే ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదం లభించనుంది. ఇప్పుడు అందరి కళ్లు ఐపీఎల్ పైనే ఉన్నాయి. టీమిండియా ఆటగాళ్లే కాకుండా ఇతర జట్ల ఆటగాళ్లు కూడా టీ20 ప్రపంచకప్‌లో చోటు సంపాదించుకోవాలంటే ఐపీఎల్ ప్రదర్శన కీలకం కానుంది.’’ అని పేర్కొన్నాడు. కాగా ఆటగాడిగా టీమిండియాలో కీలక పాత్ర పోషించిన సిద్దు రిటైర్ అయ్యాక వ్యాఖ్యాతగా మారాడు. ఆ తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుని రాజకీయాల్లోకి వెళ్లాడు. మంత్రిగా కూడా పని చేశాడు. తాజాగా మళ్లీ వ్యాఖ్యాతగా క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.