Share News

LSG vs GT: చెలరేగిన స్టోయినీస్.. గుజరాత్ ముందు మోస్తరు లక్ష్యం

ABN , Publish Date - Apr 07 , 2024 | 09:31 PM

మార్కస్ స్టోయినీస్ హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ మిగతా బ్యాటర్లు అంతగా సహకరించకపోవడంతో గుజరాత్ టైటాన్స్ ముందు లక్నోసూపర్ జెయింట్స్ జట్టు 164 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాటర్లలో స్టోయినీస్(58) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్(33), నికోలస్ పూరన్ (32) పర్వాలేదనిపించారు.

LSG vs GT: చెలరేగిన స్టోయినీస్.. గుజరాత్ ముందు మోస్తరు లక్ష్యం

లక్నో: మార్కస్ స్టోయినీస్ హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ మిగతా బ్యాటర్లు అంతగా సహకరించకపోవడంతో గుజరాత్ టైటాన్స్ ముందు లక్నోసూపర్ జెయింట్స్ జట్టు 164 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాటర్లలో స్టోయినీస్(58) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్(33), నికోలస్ పూరన్ (32) పర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో దర్శన్ నల్కండే(2/21), ఉమేష్ యాదవ్(2/22) చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్‌ను ఆరంభంలోనే గుజరాత్ పేసర్ ఉమేష్ యాదవ్ దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో కీలకమైన డికాక్(6), దేవదత్ పడిక్కల్(7)ను పెవిలియిన్ చేర్చాడు. దీంతో 18 పరుగులకే గుజరాత్ 2 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో లక్నోను కెప్టెన్ రాహుల్, మార్కస్ స్టోయినీస్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 13వ ఓవర్లో దర్శన్ నల్కండే విడదీశాడు. 3 ఫోర్లతో 31 బంతుల్లో 33 పరుగులు చేసిన రాహుల్‌ను ఔట్ చేశాడు.


అనంతరం పూరన్‌తో కలిసి స్టోయినీస్ లక్నో స్కోర్‌ను 100 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ కెరీర్లో 8వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే మరోసారి చెలరేగిన నల్కండే హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న స్టోయినీస్‌ను ఔట్ చేశాడు. దీంతో 112 పరుగులకు లక్నో 4 వికెట్లు కోల్పోయింది. 4 ఫోర్లు, 2 సిక్సులతో స్టోయినీస్ 43 బంతుల్లో 58 పరుగులు చేశాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో 114 పరుగులు చేసింది. మోహిత్ శర్మ వేసిన 18వ ఓవర్లో 17 పరుగులొచ్చాయి. 11 బంతుల్లో 25 పరుగలు చేసిన ఆయూష్ బదోనిని 19వ ఓవర్లో రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. దీంతో 143 పరుగులకు లక్నో సగం వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో లక్నోసూపర్ జెయింట్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. 3 సిక్సులతో 22 బంతుల్లో 32 పరుగులు చేసిన పూరన్, 2 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో చివరి 5 ఓవర్లలో లక్నో 49 పరుగులే చేసింది. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే రెండేసి వికెట్లు.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..

MI vs DC: రోహిత్ శర్మ ఖాతాలో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే..

MI vs DC: దుమ్ములేపిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీపై సూపర్ విక్టరీ

Updated Date - Apr 07 , 2024 | 09:38 PM