Share News

IPL 2024 Watch: అర్జున్ టెండూల్కర్‌కు స్టంప్స్ ఎలా పడగొట్టాలో చూపించిన మలింగ

ABN , Publish Date - Apr 10 , 2024 | 04:56 PM

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇటీవలనే గెలుపు బాట పట్టింది. ఆరంభంలో హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన ముంబై నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఫామ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో ఐదో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఇక వరుసగా విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాలని భావిస్తోంది.

IPL 2024 Watch: అర్జున్ టెండూల్కర్‌కు స్టంప్స్ ఎలా పడగొట్టాలో చూపించిన మలింగ

ఐపీఎల్ 2024లో(IPL 2024) ముంబై ఇండియన్స్ ఇటీవలనే గెలుపు బాట పట్టింది. ఆరంభంలో హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన ముంబై (Mumbai Indians) నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఫామ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో ఐదో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఇక వరుసగా విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాలని భావిస్తోంది. తద్వారా టోర్నీని నిదానంగా ఆరంభించి చివరికి కప్ గెలుస్తుందని తమపై ఉన్న పేరును మరోసారి నిజం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే నాలుగో మ్యాచ్‌లో లభించిన విజయాలన్ని ఐదో మ్యాచ్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. దీంతో గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో ముంబై ఆటగాళ్లు శిక్షణా శిబిరంలో శ్రమిస్తున్నారు. పేస్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ అధ్యర్యంలో యువ బౌలర్లు బౌలింగ్ వేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.


ముంబై మేనేజ్‌మెంట్ షేర్ చేసిన 16 సెకన్ల వీడియోలో అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) సహా పలువురు యువ బౌలర్లు బౌలింగ్ చేయడం చూడొచ్చు. ఒక స్టంప్ పెట్టి దానికి బంతి తగిలేలా వారు బౌలింగ్ చేశారు. అయితే వారు వేసిన బంతులు ఏవి కూడా స్టంప్‌కు తగలలేదు. కానీ లసిత్ మలింగ(Lasith Malinga) వేసిన బంతి మాత్రం స్టంప్‌కు తగిలింది. 40 ఏళ్ల వయసులోనూ గురి తప్పకుండా లసిత్ మలింగ వేసిన బాల్ ఆకట్టుకుంటుంది. దీంతో అర్జున్ టెండూల్కర్‌తో సహా ఇతర యువ బౌలర్లకు స్టంప్స్ ఎలా పడగొట్టాలో మలింగ చూపించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన అభిమానులు లసిత మలింగపై ప్రశంసలు కురిపించారు. కాగా తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు లసిత్ మలింగ ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. మొదట బౌలర్‌గా ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో ఆడిన 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం బౌలింగ్ కోచ్‌గానూ ముంబై విజయాల వెనుక మలింగ ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

IPL 2024: ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..

Updated Date - Apr 10 , 2024 | 04:58 PM