Share News

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:00 PM

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ 2024(IPL 2024) ఫుల్ మజాను పంచుతోంది. బ్యాటర్ల పరుగుల వరద, బౌలర్ల వికెట్ల వేటకు తోడు ఫీల్డర్ల అద్భుత విన్యాసాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటర్లు, బౌలర్లు ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ మ్యాచ్ గెలవాలంటే ఫీల్డింగ్‌లోనూ రాణించడం ముఖ్యం.

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..
Ravi Bishnoi takes IPL 2024 Best catch

లక్నో: క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ 2024(IPL 2024) ఫుల్ మజాను పంచుతోంది. బ్యాటర్ల పరుగుల వరద, బౌలర్ల వికెట్ల వేటకు తోడు ఫీల్డర్ల అద్భుత విన్యాసాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటర్లు, బౌలర్లు ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ మ్యాచ్ గెలవాలంటే ఫీల్డింగ్‌లోనూ రాణించడం ముఖ్యం. ఫీల్డర్లు పట్టే అద్భుత క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలను నిర్ణయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. కనురెప్పపాటులో ఫీల్డర్లు చేసే విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తాయి. అచ్చం ఇలాంటిదే ఆదివారం జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నోసూపర్ జెయింట్స్ (Lucknow Super Giants vs Gujarat Titans) మ్యాచ్‌లోనూ జరిగింది. లక్నోసూపర్ జెయింట్స్ ఆటగాడు రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) పట్టిన క్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని చాలా మంది క్రికెట్ అభిమానులు ఈ సీజన్‌లోనే బెస్ట్ క్యాచ్‌గా వర్ణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో 164 పరుగుల లక్ష్య చేదనలో భాగంగా గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆరో ఓవర్లో కెప్టెన్ గిల్(19)ను యష్ ఠాకూర్ ఔట్ చేశాడు.


ఆ కాసేపటికే 8వ ఓవర్లో కీలకమైన కేన్ విలియమ్సన్‌ను రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్ రెండో బంతిని కేన్ విలియమ్సన్ స్ట్రెట్‌గా గాల్లోకి ఆడాడు. అది బిష్ణోయ్ కుడి వైపు నుంచి వెళ్లబోయింది. అది గమనించిన బిష్ణోయ్ వెంటనే తన బౌలింగ్ పొజిషన్ నుంచి తేరుకొని పక్షిలా గాల్లోకి ఎగిరి కుడి చేతితో క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత కింద కూడా పడినప్పటికీ బంతిని వదలకుండా చేతిలోనే ఒడిసిపట్టుకున్నాడు. దీంతో విలియమ్సన్ షాక్‌కు గురయ్యాడు. కానీ చేసేదేమి లేక ఒకే ఒక పరుగుకే ఔటై పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఈ వికెట్‌తో మ్యాచ్ కూడా లక్నో వైపు తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు రవి బిష్ణోయ్‌పై ప్రశంసంలు కురిపిస్తున్నారు. ఈ సీజన్‌లోనే ఇది బెస్ట్ క్యాచ్ అని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్ మొత్తంలో రవి బిష్ణోయ్ 2 ఓవర్లే బౌలింగ్ చేసినప్పటికీ 8 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన విలియమ్సన్ వికెట్ తీశాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ టైటాన్స్‌పై లక్నోసూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోసూపర్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినీస్(58) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పూరన్ (32), రాహుల్ (33) రాణించారు. ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య చేధనలో గుజరాత్ టైటాన్స్ 130 పరుగులకే ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్(31), రాహుల్ తెవాటియా(30) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్ 5 వికెట్లతో చెలరేగాడు. కృనాల్ పాండ్యా 3, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: ముంబై, లక్నో విజయాలతో పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఇవే!

MI vs DC: దుమ్ములేపిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీపై సూపర్ విక్టరీ

Updated Date - Apr 08 , 2024 | 04:02 PM